Breaking News

దళిత బహుజనుల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

రుద్రూరు, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి)

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి అని రుద్రూరు మండలానికి చెందిన దళిత, బహుజన మహిళలు పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుద్రూరు మండల కేంద్రం, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేశారని వారు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులుగా పత్తి రాము, పత్తి లక్ష్మణ్, బద్దం సంజీవరెడ్డి, ఇందూరు చంద్రశేఖర్, అక్కపల్లి నాగేందర్ తదితరులను మహిళలు కొనియాడారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.రుద్రూరు మండల అభివృద్ధితో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని మహిళలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత, బహుజన మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *