Breaking News

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను పరామర్శించిన టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్

వేములవాడ, నవంబర్ 16: (E6tv NEWS).

వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి గాయమై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆది శ్రీనివాస్‌ను సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో విజయ్ ఆజాద్ కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కొమిరెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆది శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు విజయ్ ఆజాద్ తెలిపారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి పండ్లు అందజేశారు.తనను ఆప్యాయంగా పరామర్శించేందుకు వచ్చిన విజయ్ ఆజాద్‌కు ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి చిత్రపటాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, న్యాయవాది సురభి అశోక్, నాగరాజు, కిషన్, రాజేందర్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *