Breaking News

జిల్లా మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం తీసుకున్న బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్

నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS).

జిల్లాలోని మున్నూరు కాపుల అభ్యున్నతి, అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ స్పష్టం చేశారు. మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉంటూ సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.సోమవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో ఉన్న పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో అధ్యక్షుడు మిద్దె రవికుమార్, కార్యదర్శి దారం పోతన్న, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ పటేల్ మాట్లాడుతూ.. పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉంటేనే సమాజంలో ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యత కోసం కృషి చేయాలని, మున్నూరు కాపులు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడే కులం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.పంచముఖి మున్నూరు కాపు సంఘంలో వంద మందికి పైగా సభ్యులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండటం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. పంచముఖి సంఘంతో పాటు జిల్లాలోని అన్ని మున్నూరు కాపు సంఘాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నానని, అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మిద్దె రవికుమార్, దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్ మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధిలో భాగంగా మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్‌ను సభ్యత్వం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం గురించి ముందే తెలుసని, సభ్యులంతా అన్నదమ్ముల్లా ఐక్యంగా ఉండటం అభినందనీయమని ఆయన పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. సంఘంలో సభ్యత్వం స్వీకరించిన జగన్మోహన్ పటేల్‌కు సాదర స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారులు హరిదాస్ సాయిరెడ్డి, వైసాక్షి సంతోష్, ఉపాధ్యక్షులు ముకుందం శ్రీనివాస్, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్, మారుతి, సహాయ కార్యదర్శి రఘునందన్, ప్రచార కార్యదర్శి సంతోష్, కార్యవర్గ సభ్యులు ఆకుల తిరుమల్, బొబ్బిలి కిషన్, రవీందర్, శివకుమార్ తదితరులతో పాటు పంచముఖి మున్నూరు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *