మంత్రి సవితమ్మకు వినతిపత్రం
కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి).
ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు.
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏలుగా అవకాశం కల్పించాలని వారు కోరారు. అలాగే విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కల్పించాలని మంత్రిని కోరారు.వీఆర్ఏల సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సవితమ్మ హామీ ఇచ్చినట్లు వీఆర్ఏ సంఘం నాయకులు తెలిపారు.
మంత్రి సవితమ్మను కలిసిన వారిలో వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. పెద్దన్న, జిల్లా నాయకులు ఎస్. పెద్దన్న, గంగాద్రి, టీ. పెద్దన్న, శివప్రసాద్, సాయి ప్రసాద్, నరసింహులు తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.


