Breaking News

ఆటోపై కూలిన భారీ వృక్షం.. ఐదుగురికి గాయాలు!

డ్రైవర్, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

రుద్రూర్ (E6tv న్యూస్).

రుద్రూర్–బోధన్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి ఆటోపై పడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన కలకలం రేపింది. బోధన్ వైపు వెళ్తున్న TS 16 UA 0344 నంబర్ గల ఆటోపై ఒక్కసారిగా భారీ వృక్షం కూలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వర్ని మండలం పెద్దగుట్ట గ్రామానికి చెందిన వారుగా స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారీ వృక్షం ఆటోపై కూలిన ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *