Breaking News

మట్టి మాఫియాపై ఎల్లారెడ్డి పోలీసుల కొరడా

అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు సీజ్‌.. యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు

ఎల్లారెడ్డి, నవంబర్ 11 (E6tv న్యూస్).

ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న ఆరు ట్రాక్టర్లను ఎల్లారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం (నవంబర్ 11) ఉదయం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీశన్‌పల్లి రోడ్డు సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేశారు.అక్రమ మట్టి రవాణాకు పాల్పడిన ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తదితర సహజ వనరులను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి పోలీసులు హెచ్చరించారు.ప్రభుత్వ సహజ వనరుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *