Breaking News
నవంబర్ నుంచి విద్యుత్ చార్జీల మోత!
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై మరోసారి అదనపు భారం పడనుంది. డిస్కంలు రూ. 5,420 కోట్ల మేర ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు, సరఫరా సమయంలో డిస్కంలకు అయిన వాస్తవ వ్యయానికి, టారిఫ్ ద్వారా వచ్చిన రాబడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసేందుకు ఈ ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నియంత్రణ సంస్థ నిర్ణయించిన…
వేగంగా కోలుకుంటున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్.
ఫ్లైదుబాయ్ విమాన కాక్‌పిట్‌లో సహ పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం అబుదాబి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. తలకు తీవ్ర గాయాలు, పుర్రెలో పగులు మరియు కంటిచూపు మందగించినప్పటికీ ఆయన మానసికంగా దృఢంగా ఉన్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న FZ1073 విమానంలో కో-పైలట్ దాడి చేయగా, స్మిత్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బంది సాయంతో అతడిని అడ్డుకుని,…
బెంగాల్ పోలింగ్‌లో రచ్చ: పోలీసులపైకి టీఎంసీ కేడర్!
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల పోలింగ్ వేళ ముర్షిదాబాద్ జిల్లాలోని రేజీనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు మరియు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. పారదర్శకంగా జరగాల్సిన పోలింగ్ ప్రక్రియను టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రత్యర్థిగా పోలీసులే స్వయంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీఎంసీ కార్యకర్తలు ఎదురు ఆరోపణలు చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇరువర్గాల…
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం!
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెనిన్ నగరం నుంచి లాగోస్‌కు సాధారణ మిషన్‌పై వెళ్తున్న నైజీరియా వైమానిక దళానికి చెందిన ఎటీఆర్–42 (ATR-42) విమానం అక్టోబర్ 5న ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా ప్రాంతంలో నావల్ బేస్ సమీపంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు బోలా టినుబు, ఘటనపై సమగ్ర…
విశాఖలో క్రిప్టో మోసం: రూ. 20 లక్షలు స్వాహా!
విశాఖపట్నానికి చెందిన 28 ఏళ్ల ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌కు గురై రూ. 20 లక్షలు కోల్పోయారు. వాట్సాప్ ద్వారా పరిచయమైన ఖుషీ అనే మహిళ, తను థోర్న్స్టన్ అండ్ రాస్ సంస్థలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, ప్లాట్‌ఫారమ్ ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నానని చెప్పింది. ట్రేడింగ్ ప్రాఫిట్స్ స్క్రీన్షాట్లు చూపి నమ్మించడంతో, బాధితుడు మొదట ఆగస్టు 2026లో రూ. 60,000 పెట్టుబడి పెట్టగా యాప్‌లో రూ. 4,000 లాభం చూపించింది. ఆపై మరింత…
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం చేయడమే లక్ష్యం
ముంబయి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉన్నతస్థాయి బృందం ఆదివారం ముంబయిలో పర్యటించింది. ముంబయిలోని ఆంధ్ర మహాసభలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను కమిటీ సభ్యులు గుర్తించి సత్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ అడ్లంకి దయాకర్, ప్రొఫెసర్…
మాదిగలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
రైతులకు నిరంతర విద్యుత్, వరికి మద్దతు ధర కల్పించాలి జుక్కల్, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు,…
కలెక్టర్ ఆదేశాలను పాటించని బోధన్ ఎంఈఓ?
విద్యార్థికి టీసీ, బోనఫైడ్ ఇప్పించాలని సబ్ కలెక్టర్‌కు వినతి బోధన్:, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మైనార్టీ విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇక్రా మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఎత్తోండ రాజేందర్ కోరారు.ఈ మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి శేక్ తాజ్రీమ్ ఆర్థిక…
23 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ
రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్…
ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర సర్వే చేయాలి
నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి వర్ని, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా సమగ్రంగా సర్వే నిర్వహించి, పార్టీలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్ని మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ వర్ని మండల అధ్యక్షులు ఆవుల రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజమైన అర్హులకు…
