రైతులకు నిరంతర విద్యుత్, వరికి మద్దతు ధర కల్పించాలి
జుక్కల్, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి).
మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విధంగా విధానాలను అమలు చేయాలని రూసేగం భూమయ్య మాదిగ కోరారు.


