ఫ్లైదుబాయ్ విమాన కాక్‌పిట్‌లో సహ పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం అబుదాబి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. తలకు తీవ్ర గాయాలు, పుర్రెలో పగులు మరియు కంటిచూపు మందగించినప్పటికీ ఆయన మానసికంగా దృఢంగా ఉన్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న FZ1073 విమానంలో కో-పైలట్ దాడి చేయగా, స్మిత్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బంది సాయంతో అతడిని అడ్డుకుని, విమానాన్ని సౌదీలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసి 174 మంది ప్రయాణికులను కాపాడారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన కెప్టెన్ స్మిత్, తాను త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
వేగంగా కోలుకుంటున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్.

