Breaking News

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్ కత్తి నరేందర్‌కు ఘన సన్మానం

నిర్మల్, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లాలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్‌ను మాదిగ ఎంప్లాయీస్ నిర్మల్ జిల్లా ప్రతినిధులు, కాలనీ మైనార్టీ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్తి నరేందర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కత్తి సురేష్, ఉప్పిరి రవి, చందుల చందు, సుభాన్‌తో పాటు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు…

Read Full News

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…

Read Full News

బీడీ కార్మికులపై అదనపు వసూళ్లు ఆపాలి

దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్,అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)బీడీ కార్మికుల నుంచి వేయి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్…

Read Full News

నైపుణ్యంతోనే మహిళా సాధికారత

యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ తమ సొంత కాళ్లపై నిలబడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు….

Read Full News

మౌంట్ తరంగ్–II అధిరోహించిన విశాలావత్ బన్నీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో ఉన్న మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన సాంకేతిక శిఖరం మౌంట్ తరంగ్–IIను విజయవంతంగా అధిరోహించిన తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విశాలావత్ బన్నీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో కూడిన భారతీయ పర్వతారోహణ బృందం మియార్ లోయలో సవాలుతో కూడిన ఈ శిఖరారోహణను విజయవంతంగా…

Read Full News

పెట్రోల్ లీటరుకు రూ.5, డీజిల్ రూ.3 పెంచేసిన నయారా ఎనర్జీ!

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల వ్యయాలు గణనీయంగా పెరగడంతో, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ ‘నయారా ఎనర్జీ’ (Nayara Energy) ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శనివారం (అక్టోబర్ 3, 2026) తెల్లవారుజాము నుంచే పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు తక్షణమే అమల్లోకి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి ఉన్న 7,108 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ నూతన ధరలు వర్తిస్తాయి. ధరల…

Read Full News

బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలి

అక్టోబర్ 6న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలితెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న ముధోల్, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘ఛలో భైంసా’…

Read Full News

సైబర్ వలలో చిన్నారులు… తల్లిదండ్రులకు సీఎం రేవంత్ హెచ్చరిక!

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)’ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ యుగంలో పిల్లలకు సైబర్ ముప్పు పెరిగిపోతోందని, వారి రక్షణ కోసం రాష్ట్రంలో త్వరలోనే ఒక సమగ్ర ‘చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’ (Comprehensive Child Online Safety Framework)ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్ఎస్ఏ (TGS-LSA) భాగస్వామ్యంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేసి, గ్రామ స్థాయి వరకు న్యాయ…

Read Full News

ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7న భారీ నిరసన ర్యాలీ

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: కాట్‌పల్లి నగేష్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని అఖిలపక్షాల డిమాండ్ ఓటు హక్కు పరిరక్షణ కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు నిజామాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: శివ ఠాకూర్). ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి మిత్రపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్…

Read Full News

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు!

భవానీనగర్ పోలీసు కస్టడీలో తనపై భౌతిక వేధింపులు జరిగాయంటూ మహ్మద్ షానవాజ్ ఆలం చేసిన ఫిర్యాదుపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు జస్టిస్ టి. మాధవీదేవి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, పూర్తిస్థాయి వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. కేసు నేపథ్యం మరియు వివాద పాయింట్లు: అయితే, ప్రస్తుత…

Read Full News