Breaking News

వరద కాలువ తూమ్‌లు తెరిచి చెరువులు నింపాలి: బీఆర్‌ఎస్ డిమాండ్

రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్, ప్రశాంత్ రెడ్డిదేనని బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్య మోర్తాడ్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా కమర్‌పల్లి–మోర్తాడ్ మండలాల సరిహద్దులోని వరద కాలువలోకి గోదావరి జలాలు చేరడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమర్‌పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ తెలిపారు. తిమ్మాపూర్ వరద కాలువ బ్రిడ్జి వద్ద…

Read More

ఆగస్టు 18లోపు గౌడలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ ఆగస్టు 2: E6 tv NEWS (A,తిరుపతి గౌడ్). జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడంతో పాటు ఎన్నికల సమయంలో గౌడ సమాజానికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆగస్టు 18లోపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి…

Read More

కుమార్తె వివాహానికి రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

హైదరాబాద్, ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని రాష్ట్ర స్థాయి ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఆహ్వాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…

Read More

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే…

Read More

ఇందూరు ఊర పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ – బీజేపీ కార్పొరేటర్లు

నిజామాబాద్, ఆగస్టు 2: E6 tv NEWS శివ ఠాకూర్ నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన సాంప్రదాయ ఇందూరు ఊర పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే పండుగ ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు…

Read More

నిజామాబాద్ ‘ఊర పండుగ’ – తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీక

ఇందూరు ఆగస్టు 2: E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్, ఆగస్టు 2: తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, సర్వ సమాజ్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ (ఇందూర్) ఊర పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రోజునే జరిగే ఈ ఉత్సవం శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి, నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఊర పండుగ…

Read More

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా పంపిణీ ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి జుక్కల్ ఆగస్టు 1: (E6 tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం శనివారం…

Read More

ఇల్లు కూల్చివేస్తామని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళ ధర్నా

సర్పంచ్‌పై కక్ష సాధింపు ఆరోపణలు ఎంపీడీవో హామీతో విరమించిన ఆందోళన మద్నూర్ ఆగస్టు 1: (E6 tv NEWS, M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కెల్లూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇంటిని కూల్చివేస్తామని బెదిరిస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగింది. సర్పంచ్‌కు ఓటు వేయలేదనే కక్షతో తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది.బాధిత మహిళ మాట్లాడుతూ, తన ఇంటిని కూల్చివేయాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయ…

Read More

పత్తి పంటలో ప్యారా విల్ట్‌పై రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ అనిల్

అంతాపూర్ గ్రామంలో పత్తి పంట పరిశీలన సరైన డ్రైనేజీ, శాస్త్రీయ నిర్వహణతో 90 శాతం వరకు మొక్కలను కాపాడవచ్చని సూచన మద్నూర్, ఆగస్ట్ 1: (E6 tv NEWS, M.మస్నాజీ) కామారెడ్డి జిల్లా అంతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అనిల్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ప్యారా విల్ట్ (Para Wilt) సమస్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యారా విల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత…

Read More

సాహిత్య రత్న అన్నా బహు సాటే 106వ జయంతి ఘనంగా నిర్వహణ

బిచ్కుంద మండలం శాంతాపూర్‌లో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నివాళులు అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహనీయుడని కొనియాడిన నాయకులు బిచ్కుంద, ఆగస్టు1: (E6 tv NEWS, ప్రతినిధి). కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో సాహిత్య రత్న, లోక్ సాహిర్ అన్నా బహు సాటే 106వ జయంతిని ఎంఆర్‌పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు అన్నా బహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి…

Read More