Breaking News

నిమ్స్‌లో ఏసీబీ కలకలం: అధికారుల ఇళ్లలో ముమ్మర సోదాలు!

హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం నిమ్స్ ఆసుపత్రిలోని పలువురు ఉద్యోగుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే లక్ష్మీ భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ, ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల…

Read Full News

“దేవుళ్లను కూడా విడదీస్తున్నారు”: సీఎం రేవంత్ వ్యాఖ్యలు

ఢిల్లీలోని మీడియా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తర-దక్షిణ భారతదేశ ప్రాంతీయ, ఆధ్యాత్మిక గుర్తింపులపై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. దక్షిణ భారతీయులమైన తాము ద్రావిడులమని, శివభక్తులమని, ఉత్తరాది ప్రజలు ఆర్యులు, రామభక్తులని పేర్కొన్న ఆయన, శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణించారు. బీజేపీ కేవలం ‘జై శ్రీరామ్’ అని మాత్రమే నినాదాలు చేస్తోందని, ‘హర హర మహాదేవ్’ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి…

Read Full News

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

తహసీల్దార్ తారాబాయి వైఖరి మార్చుకోవాలి: బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి వైఖరి సరిగా లేదని, కొంతమందికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన వైఖరిని మార్చుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు….

Read Full News

ఫార్మాసిటీ భూములపై ఫైర్.. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద రైతుల ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ 2,500 ఎకరాల పట్టా భూములను నిషేధిత (22-ఏ) జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫార్మాసిటీ బాధితులు, రైతులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రధాన రహదారిపైకి వచ్చి నిరసన తెలపగా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read Full News

ఫార్ములా-ఈ రేసు కేసు: KTR సహా నలుగురి పాస్‌పోర్టులు జప్తు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలని హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి (RPO) కోర్టు అధికారికంగా లేఖ రాసింది. విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలన్న ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం…

Read Full News

రైతు రామ్‌సింగ్ సమస్యకు పరిష్కారం

బోధన్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ పట్టణంలోని రైతు డిపో వద్ద సెప్టెంబర్ 25న రైతు రామ్‌సింగ్, రైతు డిపో యజమాని జగన్నాథరావు మధ్య నెలకొన్న సమస్యపై నిర్వహించిన ధర్నాకు పరిష్కారం లభించిందని సీపీఎం నాయకులు తెలిపారు. సోమవారం ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం, బెల్లాల్ గ్రామ ప్రజలు, వామపక్ష పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు తెలిపారు.రైతు రామ్‌సింగ్, రైతు డిపో…

Read Full News

ఉచిత వైద్య శిబిరంలో జూనియర్ సివిల్ జడ్జి

భైంసా, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బైంసా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా జూనియర్ సివిల్ జడ్జి ఆర్.కే. వెంకటరమణ సుహాస్ హాజరై శిబిరాన్ని పరిశీలించారు. మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స, వైద్య సలహాలు అందించారు. ఈ…

Read Full News

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్…

Read Full News

అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు: మంత్రి సవిత

సోమందేపల్లి, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు వారి మానసిక, శారీరక అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాసేవలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేవా…

Read Full News

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…

Read Full News