Breaking News

లింబాద్రిగుట్టలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న న్యాయమూర్తులు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు భీంగల్, జూలై 26: (E6 tv NEWS: T, గంగాధర్) భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మణ్ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

Read More

పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి భైంసా, జూలై 26: (E6 tv NEWS: తిరుపతి గౌడ్) రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, పెండింగ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు,…

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం

నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు నిజామాబాద్, జూలై 26: (E6 tv NEWS). నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నీటిలో నలుగురు విద్యార్థులు మునిగిపోగా, వారిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ…

Read More

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం…

Read More

ముధోల్ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి ఫలితమే: ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృతజ్ఞతలు స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానున్న అధ్యయన కేంద్రం ముధోల్, జూలై 25: (E6 tv NEWS:తిరుపతి గౌడ్)ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ముధోల్‌తో పాటు పరిసర…

Read More

నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

Read More

అమరులైన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి

నీట్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి ముధోల్, జూలై 25: (E6 tv NEWS, తిరుపతి గౌడ్).నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సంఘీభావంగా ముధోల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి అమరులైన విద్యార్థులకు…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల ఎల్ఓసీ అందజేత

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ భీంగల్, జూలై 25: (E6 tv NEWS: T,గంగాధర్) భీంగల్ మండల కేంద్రంలోని బోయిగల్లికి చెందిన పల్లేర్ల వైశ్విక్ (తండ్రి: అరుణ్ బాబు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

Read More

గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు

డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…

Read More

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…

Read More