Breaking News

బాబాపూర్‌లో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్‌పై అవగాహన సమావేశం

గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది) భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ…..

Read Full News

బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం

రుద్రూర్‌లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు…

Read Full News

కుబీర్‌లో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నాయకుడు

మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రవి కుబీర్, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కుబీర్ మండలానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం పాల్సి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ మండల నాయకుడు రవి, మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు….

Read Full News

భైంసాలో రేపటి ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

అనివార్య కారణాలతో సెప్టెంబర్ 30న జరగాల్సిన కార్యక్రమం వాయిదా భైంసా, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 30న భైంసా క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల (IPS) పర్యవేక్షణలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అనివార్య పరిస్థితుల కారణంగా…

Read Full News

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు

ఎర్గట్లలో ఉత్సాహంగా నిర్వహణ.. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు అవకాశం ఎర్గట్ల, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం మండల స్థాయి క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీ, 100 మీటర్ల పరుగు పందెం, స్పూన్ అండ్ మార్బుల్,…

Read Full News

ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు

ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు…

Read Full News

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: శివ ఠాకూర్) ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌ యాత్ర మంగళవారం నిజామాబాద్‌ అర్బన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్‌ డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో…

Read Full News

బదిరులకు అండగా ఉంటా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

ఇందూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) జిల్లాలోని బదిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ బదిరుల్లో ఎంతో మేధాశక్తి, ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. సాధారణ వ్యక్తులతో సమానంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగుతున్న బదిరులను అభినందించారు. బదిరులుగా ఉంటూనే ప్రభుత్వ…

Read Full News

కేజీబీవీ విద్యార్థులకు 35 డబుల్ డెస్క్ బెంచీల పంపిణీ

భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) విద్యార్థుల సౌకర్యార్థం భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు 35 డబుల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి ఈ బెంచీలను అందజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే ఉద్దేశంతో డబుల్ డెస్క్ బెంచీలను అందించడం పట్ల పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వసతుల కల్పనకు సహకరించిన…

Read Full News

“ఆధారాలు బయటపెడతా”: KTR పై కవిత ఘాటు వ్యాఖ్యలు!

నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత (మాజీ ఎమ్మెల్సీ) కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా కేటీఆర్ తన సొంత వైఫల్యాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తాను ఒక అవినీతి నాయకుడిని విమర్శిస్తే సస్పెండ్ చేశారని, ఇప్పుడు అదే నాయకుడితో కేటీఆర్…

Read Full News