Breaking News
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…
మోర్తాడ్ మండలంలో ఆత్మీయులను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మోర్తాడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధర్మోరా గ్రామంలో సాయన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉషన్న…
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం బహదూర్‌పల్లి రైతుల భూముల సేకరణపై కేటీఆర్ ప్రశ్నలు
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో బహదూర్ పల్లి రైతుల వ్యవసాయ భూములను అడ్డగోలుగా లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, పేద రైతుల భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల నివాసాలు, భూములు కోల్పోతున్న బహదూర్ పల్లి రైతులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు….
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్: దినేష్ కులచారి,ఎమ్మెల్యే ధన్‌పాల్.
బల్దియా సమస్యలు పరిష్కరించాలి.. బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: శివ ఠాకూర్). ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ వి. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ…..
అరవింద్‌పై జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
పసుపు బోర్డు, రైతుల సమస్యలపై ఎంపీని నిలదీసిన బీఆర్‌ఎస్ నేత నిజామాబాద్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవింద్‌కు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో ఎలాంటి పాత్ర లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్…
ఆరోగ్య రంగంలో వైఫల్యాలపై తెలంగాణ ప్రభుత్వంపై కవిత ఆరోపణలు
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం, విద్యారంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, ఇది “చేతగాని, సంపూర్ణంగా విఫలమైన ప్రభుత్వం” అని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్త నిరసన ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యమైన ఆరోపణలు & కార్యాచరణ:
మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి
ఆర్మూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి). మొక్కజొన్న, సోయా పంటల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లోని కుమార్ నారాయణ భవన్‌లో AIUKS ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని…
12 కోట్ల ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నిరసన
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ నిర్మల్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్…
భగత్ సింగ్ త్యాగం చిరస్మరణీయం: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ విగ్రహానికి మంత్రి సవితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, ఆయన చూపిన ధైర్యం, నిస్వార్థ దేశభక్తి చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన…
మహిళపై లైంగిక దాడికి యత్నించి క్యాబ్ డ్రైవర్
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద తొండపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న కొత్వాల్‌గూడ నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్ మార్గాన్ని మళ్లించి ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సదరు మహిళ శంషాబాద్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో డ్రైవర్ దాడికి యత్నించగా, బాధితురాలు ధైర్యంతో వాహనం నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసి సహాయం కోరింది. దీంతో డ్రైవర్ ఆమె వద్ద ఉన్న రూ….
