Breaking News
బత్తలపల్లిలో అంగన్‌వాడీ ఉత్సవం
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు సమాజానికి ఆదర్శం: మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవంలో మంత్రి…
ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరుబాట
ఓటు హక్కు పరిరక్షణ కోస 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. TPCC ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట…
సీఈసీ రాజీనామా చేయాల్సిందే..ఢిల్లీలో విపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసన
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై ప్రశ్నలు గుప్పిస్తూ, సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మరియు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) వంటి విద్యార్థి సంఘాలతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ మరియు ‘నిర్వాచన్ సదన్’ (ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం) వద్ద భారీ ధర్నాలు చేపట్టారు….
ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.. ఆలయంలో ప్రత్యేక పూజలు
భీంగల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణంలోని చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో…
తెలంగాణ భూ రికార్డుల సమస్యలు:సామాన్యుడి భూ సమస్యలకు పరిష్కారం దొరికేనా?
తెలంగాణలో భూముల వ్యవహారం, రికార్డుల గందరగోళం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిషేధిత భూముల జాబితా (22A), అసైన్డ్, అటవీ, ఇనాం, చెరువులు మరియు ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో భూముల కేటాయింపులు, రికార్డుల మార్పుల్లో జరిగిన అక్రమాలు, పరిపాలనా లోపాలను తేల్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శ్రీదేవసేన నాయకత్వంలో ప్రభుత్వం జీవో 134 (GO 134) ద్వారా ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు…
మోపాల్‌లో దుర్గామాత ఉత్సవ సమితి నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
మోపాల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మోపాల్ గ్రామంలో శనివారం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నూతన షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమిపూజ చేశారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు,…
మిర్జాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ.. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేదలు, మహిళల హక్కుల…
పోలీసుల తీరుపై…నిమజ్జనాలు నిలిపేసి బంద్‌కు పిలుపు:ఆదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వేళ పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బ్యాండ్ మేళాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అర్ధరాత్రి వేళ కళాకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు, ఉత్సవ నిర్వాహకులు నిమజ్జనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో పట్టణంలో ప్రధాన రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వందలాది గణపతి విగ్రహాలు, వాహనాలు నిలిచిపోయాయి. శాంతియుతంగా సాగుతున్న శోభాయాత్రపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అధికారులు…
ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన ర్యాలీ
భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, పోలీసు సిబ్బంది మద్నూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణపతి నిమజ్జన ర్యాలీని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ర్యాలీగా నిమజ్జనానికి తరలించారు. ర్యాలీలో మద్నూర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొని భక్తులకు భద్రత కల్పించారు. ఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు…
గణేష్ నిమజ్జనంపై పోలీసుల పటిష్ట నిఘా
కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ క్షుణ్ణంగా…
