Breaking News
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలపై శిక్షణ
భీంగల్, సెప్టెంబర్ 25; (E6tv NEWS: ప్రతినిధి) వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికల (VGPP), VBGRAMG పథకంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో భీంగల్, వేల్పూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా బాబానగర్ గ్రామానికి సంబంధించి సామాజిక పటము, వనరుల పటము రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో PRA పద్ధతిలో గ్రామంలో అవసరమైన పనులను ఎలా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించారు….
తడపాకల్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఇటీవల వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరి నర్సయ్య, లోలపు గంగు (W/o రాజేందర్), ద్యాగల సాయన్న, గుండ కృపాల్ (S/o సురేష్) తదితరులు చెక్కులు అందుకున్నారు. మొత్తం…
రాష్ట్రంలోనే ప్రత్యేకం ఇందూరు వినాయకుడి శోభాయాత్ర
దుబ్బ చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు అంగరంగ వైభవంగా రథయాత్ర ఇందూరు, సెప్టెంబర్ 25: (E6tv NEWS: శివ ఠాకూర్). రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఇందూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం వినాయకుడి రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో…
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ రాజశ్రీ
తానూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ సీడీపీఓ రాజశ్రీ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సమతుల్యమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై…
సేవా సంకల్ప అభియాన్‌లో పలు సేవా కార్యక్రమాలు
తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…
డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇంధన పొదుపుపై డ్రైవర్లకు కీలక సూచనలు డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్, మద్యం పూర్తిగా నిషేధం నిజామాబాద్, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం రీజియన్…
ఎన్నికల సంఘం ఎందుకు వివాదాన్ని ఎదుర్కొంటోంది?
భారత కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో తీవ్ర విభేదాలు, అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో కూడా కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి అత్యంత భిన్నమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, మరియు మొత్తం ఓటర్ల జాబితాను నిర్వహించే ఐటీ డిజిటల్ సిస్టమ్ పనితీరుపై ఏకంగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు రాతపూర్వకంగా తమ తీవ్ర అభ్యంతరాలను నమోదు చేయడం ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. ఎన్నికల…
డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి అమలు ఇంటి వద్దకే 41 రకాల ఉచిత వైద్య పరీక్షలు.. 48 గంటల్లో రిపోర్టులు ధర్మవరం, సెప్టెంబరు 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, వైద్య పరీక్షల నుంచి చికిత్స వరకు అవసరమైన వైద్య సేవలను అనుసంధానం చేసే ‘సంజీవని’ కార్యక్రమాన్ని డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించి, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
బట్టాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ఎర్గట్ల, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా పాలనలో భాగంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను…
అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పది
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా శుక్రవారం ఇందూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..
