Breaking News

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాటం

బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కి.మీ. సైకిల్ యాత్ర బోధన్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి). రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బోధన్ నుంచి జగిత్యాల వరకు సుమారు 320 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్‌లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర…

Read Full News

కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు

మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని ప్రజావాణిలో వినతి జిల్లా మార్పుపై నివేదిక కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ మద్నూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి విడదీసి నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ మద్నూర్ మండల ప్రజలు ప్రజావాణిలో వినతి సమర్పించారు. “కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు” అంటూ తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 24న మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…

Read Full News

అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం

25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…

Read Full News

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలా కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఏడాది 33 జిల్లాలతో పాటు విదేశాల్లో బతుకమ్మ సంబురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు…

Read Full News

డీఎస్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు

నిజామాబాద్, సెప్టెంబర్ 27,:(E6tv NEWS: ప్రతినిధి). మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు, స్వర్గీయ డి. శ్రీనివాస్ (డీఎస్) జయంతి సందర్భంగా కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి. శ్రీనివాస్‌ గారి సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో డి. శ్రీనివాస్‌ తనదైన ముద్ర వేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలతో…

Read Full News

గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసిన VDC సభ్యులపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్‌లో VDC దౌర్జన్యాలు మితిమీరాయి 39 మంది గౌడలు, 10 మంది దళితులను సాంఘిక బహిష్కరణ చేశారంటూ ఆరోపణ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ (VDC) పేరుతో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని గౌడ కులస్తులు ఆరోపించారు. తమ కులానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేసినట్లు పేర్కొంటూ, ఇందుకు బాధ్యులైన VDC సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం…

Read Full News

శిథిలావస్థలో రుద్రూర్ వెటర్నరీ ఆసుపత్రి

పెచ్చులూడి పడుతుండటంతో సిబ్బంది, పశుపోషకుల్లో ఆందోళన నూతన భవన నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలంటున్న పాడి రైతులు రుద్రూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పైకప్పు, గోడలకు సంబంధించిన పెచ్చులు ఊడిపడి కింద పడుతున్నాయని, దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు…

Read Full News

బాపూజీ సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే

తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు బీఆర్ఎస్ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం: వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాపూజీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

Read Full News

రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో అరెస్ట్

అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ మెట్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్‌పల్లి ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సీడీపీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల మెట్‌పల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో పద్మ తనిఖీ చేశారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్టును అనుకూలంగా నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్ల నుంచి…

Read Full News

ధర్మవరం చెరువును అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేస్తాం

రూ.100–150 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక.. కేంద్ర నిధుల కోసం ప్రయత్నం: మంత్రి సత్యకుమార్ ధర్మవరం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) ధర్మవరం పట్టణానికి ప్రకృతి ప్రసాదించిన వరం ధర్మవరం చెరువని, దాని సహజ స్వరూపాన్ని కాపాడుతూ ఆధునిక హంగులతో అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్…

Read Full News