Breaking News
క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం
క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై…
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. : ఖమ్మం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందోబస్తు విధులు ముగించుకుని తిరిగి వస్తున్న తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ వాహనాన్ని ఒక వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. పోలీస్ వాహనం నుజ్జునుజ్జు: మండలంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. డ్యూటీ పూర్తయిన తర్వాత ఎస్ఐ కూచిపూడి జగదీష్, వాహన డ్రైవర్‌తో కలిసి పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు వాహనంలో తిరిగి…
పొతంగల్, ఎత్తోండా సొసైటీల్లో నామినేటెడ్ చైర్మన్ ఎన్నిక వద్దు
రైతులు, సొసైటీ సభ్యుల ద్వారానే ఎన్నిక నిర్వహించాలి సొసైటీల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలిబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ పోతంగల్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్…
నిజాంసాగర్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
అచ్చంపేటలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనఅర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిజాంసాగర్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). నిజాంసాగర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలంలోని అచ్చంపేట గ్రామంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే…
చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ
చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) సి. సూర్యనారాయణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సూర్యనారాయణ మండల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు కృషి…
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
రిమ్స్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్ష ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రతపై అధికారుల దృష్టి మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచన నిజామాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: శివ ఠాకూర్). ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనను తిరిగి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే వెల్లడిస్తానని చెప్పారు.ఎన్నికల…
‘ది ప్యారడైజ్’ రివ్యూ: నాని మాస్ ఎక్స్పెరిమెంట్ వికటించిందా?
నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి మాస్, వైలెంట్ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి నాని చేసిన ప్రయోగం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, విపరీతమైన హింస, విపరీతమైన రక్తపాతం తప్ప దానికి తగ్గ బలమైన కథ, కథనాలు లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్…
దానం నాగేందర్‌కు బిగ్ షాక్: ఖైరతాబాద్‌లో బై-ఎలక్షన్ ఫిక్స్?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, దానం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: కేసు నేపథ్యం: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, 2024లో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా…
విజయవాడ వద్ద వందేభారత్‌లో మంటలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపింది. నర్సాపూర్ నుంచి విజయవాడకు వస్తున్న వందేభారత్ రైలులోని C-4 కోచ్ చక్రాల మధ్య ఉన్న యాక్సిల్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి: రైలు ప్రయాణంలో ఉండగానే చక్రాల భాగం నుంచి పొగలు రావడం గమనించిన లోకో పైలట్, రైల్వే సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును సురక్షితంగా విజయవాడ రైల్వే…
