Breaking News
పెట్రోల్ బాంబ్: లీటర్ రూ.150 వైపు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ బెంచ్‌మార్క్ ధరలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions), ముడి చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా దేశీయంగా పెట్రోల్ బెంచ్‌మార్క్ ధర ఏకంగా 50 నెలల గరిష్టానికి ($133.05 డాలర్లు per barrel) చేరుకుంది. దీంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై (OMCs) తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్ర…
SAAP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: ఎదురెదురుగా డీఎస్సీ ఉపాధ్యాయులు, YSRCP నేతలు!
విజయవాడ: నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద సోమవారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రాలు సమర్పించేందుకు ‘మెగా డీఎస్సీ’ కింద ఎంపికైన ఉపాధ్యాయులు కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో, వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులు కూడా SAAP ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇరువర్గాలు ఆఫీస్ ప్రాంగణంలో ఎదురెదురుగా నిలబడి ఒకరికొకరు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు…
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై భూసర్వే: అధికారుల పరిశీలనలో కీలక విషయాలు!
సిద్దిపేట/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా నిర్వహించిన సర్వే ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ కాంపౌండ్ పరిధిలో అసైన్డ్ భూములు ఉన్నాయని, ఆ ఫామ్‌హౌస్ నీటి అవసరాల కోసమే ప్రధానంగా ఒక జలాశయాన్ని నిర్మించారని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో దళితేతరులు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములను ఆక్రమణలో ఉంచుకున్నారని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో…
వినాయక మండపం వద్ద చికెన్ ముక్కలు: సైదాబాద్‌లో ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్ (మదన్నాపేట్): పాతబస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్నాపేట్లో వినాయక మండపం వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ ప్రాంతం మరియు సమీపంలోని దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చికెన్ ముక్కలు, వ్యర్థాలను పడేయడంతో స్థానికులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఘటన…
హుడా కాలనీలో ఉచిత వైద్య శిబిరం
శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద ఒమేగా పీఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గణేష్ మండపం వద్ద ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు, స్థానికులు…
జూరాల ప్రాజెక్ట్ ముట్టడి ఉద్రిక్తం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అరెస్ట్!
వనపర్తి/మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్ట్ ముట్టడి’ పిలుపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా నిర్బంధిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం (హౌస్…
ఏ పార్టీ బాణాన్నీ కాదు.. బహుజనుల బాణాన్ని: కవిత
కొడంగల్/కోస్గి: తాను బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లకు సంబంధించిన ప్రతినిధిని కానని, బహుజనుల హక్కుల కోసం సంధించిన బాణాన్ని అని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బహుజనులు రాజకీయంగా అధికారాన్ని చేపట్టాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని ఆమె పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కవిత మాట్లాడారు. కవిత ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భీమ్రావు పటేల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సౌదగర్ అరవింద్
జుక్కల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ మండలం కంఠల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు పటేల్ అంత్యక్రియలు ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ సభ్యుడు సౌదగర్ అరవింద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భీమ్రావు పటేల్ పార్థివదేహాన్ని మోసి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను…
కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను, ఇతర ప్రజా సమస్యలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ “రాక్షస పాలన” సాగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
రేవంత్ పాలనలోనే పాతబస్తీకి అభివృద్ధి: వలీవుల్లా సమీర్
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని అభివృద్ధి పథంలోకి తీసుకవస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతులు, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. గతంలో పాతబస్తీని కేవలం తాత్కాలిక ఉపశమన…
