Breaking News

సమస్య చెప్పాడు.. పరిష్కారం చూపించాడు!

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పెద్ద కొడప్‌గల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను స్థానికులు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ…

Read Full News

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో న్యాయం జరిగింది

అక్బర్‌నగర్ గ్రామ పెద్దల కృషికి కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ప్రజాపాలనలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని దరఖాస్తు రుద్రూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). తనకు జరిగిన అన్యాయంపై అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో న్యాయం జరిగిందని అశోక్ తెలిపారు. అయితే గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే చొరవ లేకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన…

Read Full News

నిర్లక్ష్యమా..? ప్రమాదమా..? హత్యా..?

వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాని లోకాలకు.. లారీ ఢీకొని మయూరి నగర్ వాసి బీకుమల్ల సత్యనారాయణ మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.. పోలీసుల దర్యాప్తు అశోక్‌నగర్,సెప్టెంబర్ 21 (E6tv న్యూస్: ప్రతినిధి). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్ మయూరి నగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీవాసులు తెలిపిన…

Read Full News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు సుమారు 150 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాల పంపిణీ పెనుకొండ, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు పెనుకొండ…

Read Full News

ముస్లిం స్మశాన వాటికలో అక్రమ దుకాణాలు తొలగించాలి

ప్రజావాణిలో ముస్లిం సోదరుల ఫిర్యాదు మద్నూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ ఎదురుగా ఉన్న మైనారిటీ ముస్లిం స్మశాన వాటిక, ఈద్గా స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లను తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని ముస్లిం సోదరులు అధికారులను కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం సోదరులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ కేంద్రంలోని సర్వే నంబర్ 581లో…

Read Full News

అవకతవకలకు తావులేదు..

స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు….

Read Full News

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు

రూ.15 వేల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టివేత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా అదుపులోకి నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు అదే విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు…

Read Full News

SAAP ఆఫీస్ వద్ద రచ్చ:’తోకలు కత్తిరిస్తా’ అని హెచ్చరించిన సీఎం చంద్రబాబు!

విజయవాడ: విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, తమ పత్రాలన్నీ నిజమైనవేనని స్పష్టం చేసేందుకు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉపాధ్యాయులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు…

Read Full News

ఐఐటీ బాంబే దళిత విద్యార్థి సూసైడ్: యాజమాన్యం క్షమాపణలు!

ముంబై: ఐఐటీ బాంబే (IIT-Bombay) క్యాంపస్‌లో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల దళిత విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి మృతిపై క్యాంపస్‌లో మూడో రోజూ నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఐఐటీ బాంబే యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను డీన్ పదవి నుంచి సోమవారం తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్…

Read Full News

కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు: ‘స్వర్ణ కుప్పం’ సాధనే లక్ష్యం!

కుప్పం (చిత్తూరు): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సోమవారం బిజీబిజీగా పర్యటించారు. నియోజకవర్గాన్ని ‘స్వర్ణ కుప్పం’గా తీర్చిదిద్దే లక్ష్యంతో వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆయన శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ (RDO), ఏఎస్పీ (ASP) కార్యాలయాల నూతన భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన వివిధ…

Read Full News