Breaking News
నిరుపేదలకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి
అవకతవకలు జరిగితే రుద్రూర్ సమీకృత భవనం ముట్టడి : బీఆర్‌ఎస్ రుద్రూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన అసలైన నిరుపేదలకే కేటాయించాలని బీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి గాండ్ల మధు డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ…
కొత్త బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు ధ్వంసం
భారీ లారీల రాకపోకలు, పార్కింగ్‌తో రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసుల ఆవేదన చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్త బీసీ కాలనీ (పరిటాల రవీంద్ర కాలనీ)లో భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే మార్గంలో వెలుగు కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో 2024–25 ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.30…
ఏఐకేఎంఎస్ నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య బిచ్కుంద, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో శనివారం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను…
రోస్టర్‌లో మాలలకు న్యాయం చేయాలి
అక్టోబర్ 4న హైదరాబాద్‌లో మాలల బహిరంగ సభ మద్నూర్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి) రోస్టర్ పాయింట్లలో మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో మాలల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్నూర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల…
మెడికల్ సీటు సాధించిన సాయి తేజ
మద్నూర్, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి సాయి తేజ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటారు. మెడికల్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వరంగల్‌లోని మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్–మేఘన దంపతుల కుమారుడు సాయి తేజ మెడికల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 866వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే ప్రకటించిన ఫలితాల్లో…
దళిత బహుజనుల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూరు, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి) బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి అని రుద్రూరు మండలానికి చెందిన దళిత, బహుజన మహిళలు పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుద్రూరు మండల కేంద్రం, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేశారని వారు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించడంలో ఆయన…
రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్‌లో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ధర్మవరం, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). ధర్మవరం పట్టణంలోని సి.ఎన్.బి. గార్డెన్స్‌లో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ధర్మవరానికి చెందిన మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. నృత్య గురువు, మానస నృత్య కళాకేంద్రం ఫౌండర్ గౌ. ఆర్. మానస ఆధ్వర్యంలో శిష్యులు శాన్వి స్వరూప్, భావన, సంధ్య శ్రీ, కావ్యశ్రీ తమ అద్భుతమైన…
జమ్మికుంటలో ఘనంగా శ్రీ శక్తి మహిళా గణపతి హోమం
జమ్మికుంట, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు 6వ, 7వ వార్డుల పరిధిలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రత్యేక గణపతి హోమం, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ గొండవర్తి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్…
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడిగా పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని…
అలరించిన శిశుమందిర్ విద్యార్థుల వినాయక నిమజ్జన ఊరేగింపు
ముధోల్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. శోభాయాత్రను తిలకించిన పట్టణ ప్రజలు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.అనంతరం పట్టణ శివారులోని చెరువు…
