News
స్థానిక యాష్ చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి
KTPS యాష్ టెండర్‌పై TGGENCO సివిల్ డైరెక్టర్‌తో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చర్చ పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). KTPS యాష్ లిఫ్టింగ్ పనులను KTPP, BTPS, YTPSతో కలిపి ఒకే భారీ టెండర్‌గా నిర్వహించే విధానాన్ని పునఃపరిశీలించి, స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కోరారు. పాల్వంచకు వచ్చిన ఆయన ధరావత్ సురేష్ నివాసంలో స్థానిక యాష్ కాంట్రాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు….
భీంగల్‌లో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పోలీసుల తనిఖీలు భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. శనివారం వాగు నుంచి ఇసుక తరలింపునకు ఎమ్మార్వో ఆదేశాల మేరకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో భీంగల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ…
యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలే లక్ష్యం
తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ: డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత సంక్షేమం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్ అన్నారు. పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. భీంగల్ మండల కేంద్రంలో…
గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు
ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్ తెలిపారు. గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని…
వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి) శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ…
1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు
ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన…
పాల్వంచలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సు
పాల్వంచ, సెప్టెంబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి). ప్రవక్త ముహమ్మద్ జన్మదిన మాసమైన రబీ-ఉల్-అవ్వల్‌ను పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సును నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న మదర్సా అధ్యక్షుడు షేక్ యూసుఫ్ నివాసంలో ఒడ్డుగూడెం దారుల్ ఉలూమ్ నూరియా హనఫియా మదర్సా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, సందేశాలపై ప్రసంగించనున్నారు. మదర్సా విద్యార్థులు నాత్…
భక్తులకు మెరుగైన వసతులు.. భద్రాచలం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత
రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన భద్రాచలం, సెప్టెంబర్ 06:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.భక్తుల వసతి కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి…
పేదల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నత నేత జగ్జీవన్ రామ్
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం…
వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలపై రైతులకు శిక్షణ
పాల్వంచ: సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ క్లస్టర్ పరిధిలోని కొత్తూరు గ్రామం పేటచెరువు వద్ద ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆధ్వర్యంలో “వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలు” అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.వ్యవసాయ విస్తరణ అధికారి జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, మండల వ్యవసాయ అధికారి పి. శంభోశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…

