News
ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఎర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం…
శ్రీ లీలామృత గ్రంథ పారాయణ సమాప్తి
ఘనంగా శోభాయాత్ర.. ఉత్సాహంగా దహీ హండి డోంగ్లి, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రచార్య సంస్థానం అంతర్గత తెలంగాణ ఉపపీఠము, కామారెడ్డి జిల్లా డోంగ్లి సంత సంఘ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిర్వహించిన శ్రీ లీలామృత గ్రంథ పారాయణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.జగద్గురు శ్రీ గారు రచించిన పవిత్ర శ్రీ లీలామృత గ్రంథాన్ని భక్తులు గత 21 రోజులుగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు….
నడిరోడ్డుపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు
ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు…
ముత్యాలమ్మ జాతర నేపథ్యంలో పోలీసుల అవగాహన సదస్సు
శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు: సీఐ చరమంద రాజు అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలకు గట్టి హెచ్చరిక హుజూర్‌నగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) స్థానిక ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజు, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేలా…
నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి
నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…
బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…
భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం
భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…
అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు….
హ్యాకింగ్ చేయగల తొలి AI మోడల్: OpenAI ‘GPT-6 ఆస్ట్రా’ సంచలనం!
న్యూఢిల్లీ (E6TV): ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్ AI (OpenAI) తన సరికొత్త, అత్యంత శక్తివంతమైన ఫ్రాంటియర్ ఏఐ మోడల్ ‘GPT-6 ఆస్ట్రా’ (GPT-6 Astra) ను అధికారికంగా విడుదల చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ఎండ్-టు-ఎండ్ (సమగ్ర) పనులను స్వయంచాలకంగా పూర్తి చేసే సామర్థ్యంతో ఈ మోడల్‌ను రూపొందించారు. ఆస్ట్రా విడుదల కోడింగ్, కంప్యూటర్ నిర్వహణ విభాగాల్లోనే కాకుండా సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా కొత్త విప్లవానికి తెరతీసిందని నిపుణులు…

