ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబరు 3న జరగాల్సిన పోలింగ్‌ను రెండు రోజులు వాయిదా వేసి, నవంబరు 5న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబరు 1కి వాయిదా పడగా, నవంబరు 3న మున్సిపల్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే, నవంబరు 3నే మున్సిపల్ ఓట్ల లెక్కింపు మరియు పరిషత్ ఎన్నికల పోలింగ్ ఒకేరోజు వస్తే పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎస్‌ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ను నవంబరు 5కి మార్చడం సముచితమని పోలీసు ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై మరోసారి చర్చించి ఎస్‌ఈసీ ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

