Breaking News

ఢిల్లీ పోలీసులకు 24 గంటల టైమ్…జంతర్ మంతర్ వద్ద నిరసనకు తేదీ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నూతన వ్యూహంతో ముందుకు వచ్చింది. శాంతియుత నిరసన ప్రదర్శన కోసం సమయం కేటాయించాలని కోరుతూ సీజేపీ నాయకులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

Read Full News

‘ఇండియా’ కూటమి భేటీ తిరస్కరణపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

‘ఇండియా’ కూటమి నేతలు తనను కలవాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం స్పందించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, అలాగే ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష నేతలు నిరసన మార్చ్ చేపట్టడంతో పాటు, ఈ అంశంపై విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు సీజేఐతో భేటీ కావాలని…

Read Full News

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం – సీతక్క

మహిళా సాధికారతే లక్ష్యంగా, మహిళలు ఆర్థికంగా ఎదగడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే దిశగా హైదరాబాద్‌లో సరస్ మేళాను ప్రారంభించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించడం, వారి వ్యాపారాలను ప్రోత్సహించడం మరియు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా…

Read Full News

ఏపీ మున్సిపల్ ఎన్నికలు…మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల సీట్లు ఎవరికి?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్థానాలు ఎస్టీలకు, రాజమండ్రి-కర్నూలు స్థానాలు ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉండగా, నెల్లూరును జనరల్ కోటాలో చేర్చే ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలతో పాటు సుమారు 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం దక్కేలా…

Read Full News

పతనం నుంచి రూపాయి కోలుకుంటుందా!?

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠమైన 97కి చేరువువుతున్న నేపథ్యంలో, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అత్యంత కఠినమైన చర్యలను తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల కోసం ప్రత్యేక డాలర్ విండోను ఏర్పాటు చేయడంతో పాటు ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీలపై నూతన రిజర్వ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. అన్‌హెడ్జ్‌డ్ ఫారెక్స్ పరిమితిని 5 మిలియన్ డాలర్లకు తగ్గించడం, ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిస్క్ రిజర్వ్ (FERR) విధించడం వంటి ఆర్బీఐ…

Read Full News

మాలల రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్ల సవరణకు ధర్నా

మాలల ఉద్యోగ నియామకాల్లో న్యాయం చేయాలి రిజర్వేషన్ల అమలులో మార్పులు చేపట్టా అక్టోబర్ 15న నిజామాబాద్‌లో ధర్నాకు మాల మహానాడు పిలుపు నిజామాబాద్, అక్టోబర్ 12 (E6 TV News) మాలల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సవరణ చేపట్టి, ఉద్యోగ నియామకాల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 15న నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ దేవదాస్ ప్రకటించారు. గురువారం ఉదయం 10 గంటలకు…

Read Full News

మన దేశపు ధనికుల ఆదాయం ఎంతంటే?గణాంకాలతో ప్రపంచ బ్యాంకు…

అమెరికా, కెనడా, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోని దిగువ 10 శాతం ప్రజల ఆదాయ స్థాయి.. మన దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న (ఎగువ) 10 శాతం మంది స్థాయిని మించిపోయినట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. భారత్‌లో ఎగువ 10 శాతం ప్రజల రోజువారీ వినియోగ స్థాయి సుమారు 10 డాలర్లుగా ఉండగా.. అమెరికాలో దిగువ 10 శాతం ప్రజల స్థాయి 25 డాలర్లుగా, కెనడాలో 31 డాలర్లుగా ఉంది. దేశాల మధ్య జీవన ప్రమాణాలు,…

Read Full News

మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ చార్జీల పునరాలోచనపై మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఇటీవల ప్రవేశపెట్టిన ‘కామన్ మొబిలిటీ కార్డ్’ (నెలవారీ పాస్ ధర రూ.8,500) ధరలపై విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. ఈ ధరలు సామాన్యులకు పెనుభారంగా మారాయన్న అభ్యంతరాల నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు ఛార్జీలను తగ్గించేందుకు నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కొత్త ధరలపై తుది…

Read Full News

వెస్టిండీస్‌పై 14 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం!

ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (69) అర్ధశతకంతో చెలరేగగా, ఇషాన్ కిషన్ (37) రాణించారు. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు కట్టడి…

Read Full News

Delhi Protest Live:ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి నిరసన మార్చ్…!

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ‘ఇండియా’ కూటమి తలపెట్టిన నిరసన మార్చ్ నేపథ్యంలో న్యూఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పలు కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. బరాఖంబ రోడ్, మండి హౌస్ ప్రాంతాల్లో ఢిల్లీ…

Read Full News