News
దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!
రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి). దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర…
తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను…
బంజారా తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం
సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో నూతన 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఎల్లారెడ్డి,అక్టోబర్ 10 (E6tv News): నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ చొరవతో విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ పరిధిలో నూతన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ ధరావత్ సురేష్ విద్యుత్ అధికారుల దృష్టికి…
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం తరలింపు
పనులు పూర్తయ్యాక చౌరస్తా మధ్యలోనే తిరిగి ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే మదన్మోహన్రావు హామీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (E6tv News): పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం అంబేద్కర్ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు జాగ్రత్తగా తరలించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని తిరిగి చౌరస్తా మధ్యలోనే ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సంఘం సభ్యులు గతంలో మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అప్పటివరకు విగ్రహాన్ని…
పల్లెబోగుడా తండాలో ఉద్రిక్తత గిరిజనుల తిరుగుబాటు!
నాగిరెడ్డిపేట (e6tv news): నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించారనే ఆరోపణలతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులను తండావాసులు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అధికారులు తండాకు చేరుకుని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునే యత్నం చేయగా, మహిళలు, స్థానికులు భారీగా గుమిగూడి ట్రాక్టర్ల ముందు బైఠాయించి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణల…
చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…
వేములవాడలో పట్టుబడ్డ నాటుసారా!
వేములవాడ (e6tv news): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్రమంగా నాటుసారాను తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్ఐ రమ్య ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను చాకచక్యంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ రమ్య తెలిపారు. నిందితుడిపై…
మాజీ మంత్రి వేముల కేసీఆర్ పాలపై వ్యాఖ్యలు!
నిజామాబాద్ (e6tv news): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి స్వర్ణయుగంగా నిలిచిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కవులు, కళాకారుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతగాని పాలన సాగిస్తోందని, మళ్లీ…
నిజామాబాద్‌లో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు
110 విదేశీ, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం నిజామాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డు, ముబారక్‌నగర్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కంఠాల గంగారత్నం, ముడ భాస్కర్ ఇళ్లలో సోదాలు…
భద్రాచలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…!
భద్రాద్రి కొత్తగూడెం (e6tv news): భద్రాచలం గోదావరి తీరం నుంచి అక్రమ ఇసుక రవాణా నిత్యకృత్యంగా మారింది. సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది అక్రమార్కులు అధికారుల ఆశీస్సులతో అర్ధరాత్రి వేళ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ట్రెంచ్‌లను ఇష్టానుసారంగా పూడ్చివేసి, రాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 5:30 గంటల వరకు సుమారు 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్‌ను రూ.5000 నుండి రూ.6000 వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు, ప్రజా…
