Breaking News

ట్రంప్ పోస్ట్‌లో ‘కంట్రీ’ గందరగోళం..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. బ్రెజిల్‌లో అక్టోబర్ 4న జరిగిన తొలి విడత అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన చేసిన పోస్ట్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. బ్రెజిల్‌కు బదులుగా భారత్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు పోస్ట్ చేసిన ట్రంప్.. సుమారు 12.5 కోట్ల మంది (125 మిలియన్లు) ఓటేశారని, అంత పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగినా ఫలితాలు వెంటనే వెలువడ్డాయని పేర్కొన్నారు. డెట్రాయిట్, ఫిలడెల్ఫియా,…

Read Full News

‘ఎమ్మెల్యే స్టిక్కర్’ ఉంటే టోల్ ఫ్రీనా?వెదురుపావులూరు వద్ద టోల్ వివాదం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్‌గేట్ వద్ద ఆదివారం తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి కొండపల్లి వైపు వెళ్తున్న 18 లారీలను టోల్‌గేట్ సిబ్బంది నిలిపివేయగా, ఇవి స్థానిక ఎమ్మెల్యేకు చెందిన వాహనాలని, టోల్ రుసుము చెల్లించేది లేదని డ్రైవర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొనగా, విషయం తెలుసుకున్న గన్నవరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా టోల్ ఫీజు చెల్లించి వాహనాలను పంపించాలని, ఆ తర్వాత చెల్లించిన…

Read Full News

‘నేనేంటో చూపిస్తా’ అంటూ వైసీపీపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని

వైసీపీ నేతలపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ స్థాయి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యరపతినేని అంటే ఏంటో వైసీపీ వాళ్లకు చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో…

Read Full News

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష:సీఈసీ రాజీనామాకు డిమాండ్

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొని ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణపై గళమెత్తుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే సెప్టెంబర్…

Read Full News

సింగరేణి లాభాల వాటా పంపిణీకి డిమాండ్

సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన రూ.1.10 లక్షల దీపావళి బోనస్ (PLRB) కేవలం హెచ్‌ఎంఎస్ (HMS) కార్మిక సంఘం చేసిన అవిరళ కృషి, సుదీర్ఘ పోరాటాల ఫలితమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆమె, గుర్తింపు సంఘంతో పాటు ఇతర సంఘాల ప్రమేయం లేకుండానే ఈ బోనస్ సాధించామని, కొన్ని పత్రికలు వాస్తవాలను గుర్తించి తమ కథనాలను సరిదిద్దుకోవాలని సూచించారు. దీంతోపాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రతి…

Read Full News

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం!

తిరుమల అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో వేకువజామున రెండు గంటల సమయంలో చిరుతపులి కనిపించడం కలకలం రేపింది. మెట్ల పక్కనే కొంతసేపు సంచరించిన చిరుతను గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రాప్, సోలార్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నడక మార్గంలో నిఘాను మరింత పెంచారు. భక్తులు ఒంటరిగా కాకుండా…

Read Full News

ఎల్బీనగర్‌లో యోగా: పాల్గొన్న మాజీ కార్పొరేటర్ నర్సింహారెడ్డి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందించే ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మిలటరీలో ఉండే క్రమశిక్షణ భారతీయ యోగా సంస్థాన్‌లోనూ కనిపిస్తుందని కొనియాడారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, జీవన విధానంలో నియమ నిబద్ధతను పెంచే సాధన అని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పించిన…

Read Full News

ఏపీలో బీసీ రిజర్వేషన్ల వివాదం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటుతోందన్న కారణంతో హైకోర్టు జీవోలను రద్దు చేయగా, ప్రభుత్వం మాత్రం 2026 నాటి ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ గణాంకాలు (50.42% బీసీ జనాభా) మరియు రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా…

Read Full News

నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ప్రస్తుతం సాగుతున్న పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అలాగే ఖమ్మం నగరంలోని అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పురోగతితో పాటు సాగునీటి సరఫరా, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించే అవకాశం ఉంది….

Read Full News

తెలంగాణలో బార్లు, రెస్టారెంట్లు బంద్

తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న ‘ప్రివిలేజ్ సెస్’ను నిరసిస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెస్ వల్ల ఒక్కో బార్‌పై ఏటా 8% నుంచి 20% వరకు (సుమారు రూ. 30 లక్షలు) అదనపు భారం పడుతుందని, ఇప్పటికే బెల్ట్ షాపులు, వైన్ షాపుల అనుమతుల వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

Read Full News