Breaking News

సింగరేణి లాభాల వాటా పంపిణీకి డిమాండ్

సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన రూ.1.10 లక్షల దీపావళి బోనస్ (PLRB) కేవలం హెచ్‌ఎంఎస్ (HMS) కార్మిక సంఘం చేసిన అవిరళ కృషి, సుదీర్ఘ పోరాటాల ఫలితమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆమె, గుర్తింపు సంఘంతో పాటు ఇతర సంఘాల ప్రమేయం లేకుండానే ఈ బోనస్ సాధించామని, కొన్ని పత్రికలు వాస్తవాలను గుర్తించి తమ కథనాలను సరిదిద్దుకోవాలని సూచించారు. దీంతోపాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రతి నెలా మెడికల్ బోర్డును రెండుసార్లు నిర్వహించి, అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు తక్షణమే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సంస్థ ఆర్జించిన గత ఏడాది లాభాల్లో కార్మికులకు దక్కాల్సిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించి చెల్లించాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *