Breaking News

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష:సీఈసీ రాజీనామాకు డిమాండ్

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొని ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణపై గళమెత్తుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే సెప్టెంబర్ 29న భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్, ఈ దీక్ష ద్వారా తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తోంది. కాగా, ఇదే అంశంపై అక్టోబర్ 6న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు, అక్టోబర్ 8న ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *