Breaking News

కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌‌ సిద్ధం: ఆర్థిక మంత్రి

ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను (BIT) మరింత సులభతరం చేసేందుకు, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. గత ఏడాదిన్నరగా సిద్ధం చేస్తున్న ఈ కొత్త టెంప్లేట్‌కు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2016 నాటి పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు బలమైన రక్షణ కల్పించేలా దీనిని రూపొందించామని ఆమె స్పష్టం చేశారు. నూతన…

Read Full News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత…

Read Full News

నిర్మల్‌లో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ చేతుల మీదుగా చెక్కుల అందజేత.. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు నిర్మల్‌, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21వ వార్డు గాజులపేట్‌ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ అందజేశారు.ఈ సందర్భంగా నూర్జా బేగంకు రూ.20,000, ఖలీల్‌ అహ్మద్‌కు రూ.14,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ తన చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

Read Full News

బెంగాల్‌కు కొత్తగా 4 విమానాశ్రయాలు..

పశ్చిమ బెంగాల్‌లో విమానయాన రంగాన్ని వేగవంతంగా విస్తరించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలంగా కొత్త ‘సివిల్ ఏవియేషన్ పాలసీ’ని రూపొందించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో పురూలియా (చర్రా), పశ్చిమ మేదినీపూర్ (కాలైకుండ), దక్షిణ దినాజ్‌పూర్ (బాలూర్‌ఘాట్), అలీపుర్‌దువార్ (హసిమారా) ప్రాంతాల్లో నాలుగు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కోల్‌కతాకు…

Read Full News

రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోదావరి పుష్కరాల పనులతో పాటు రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం నిర్మల్‌, అక్టోబర్‌ 05:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌…

Read Full News

వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై చంద్రబాబు ఛాలెంజ్!

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో 90 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ గుట్టు విప్పాక…

Read Full News

భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనపై సీపీ వివరణ

పోలీసుల తప్పేమీ లేదు.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదు: పోలీస్‌ కమిషనర్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 5:(E6tv NEWS: శివ ఠాకూర్). భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఘటనకు పోలీసు వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో…

Read Full News

టీచర్ పోస్టుల భర్తీపై రాహుల్ గాంధీ లేఖ:మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 2025 నోటిఫికేషన్‌లో వర్గం-2, వర్గం-3 పోస్టుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు ఘాటు లేఖ రాశారు. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై నమోదు చేసిన కేసులను,…

Read Full News

ఇండియాలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్…భారత్‌తో ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు

భారత్‌లో మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన స్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మాలిన్, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశమయ్యారు. ఉన్నత స్థాయి వ్యాపార, అధికారిక బృందంతో వచ్చిన ఆయనకు అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలు ఘన స్వాగతం పలికారు. భారత్ మరియు యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో…

Read Full News

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం

జిల్లాలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఎన్నికల అధికారిగా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు చైర్మన్‌గా పోతంకర్ లక్ష్మీనారాయణ.. వైస్ చైర్మన్‌గా ఈ.సీనా నాయక్ ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు.. స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్ నిజామాబాద్: అక్టోబర్ 5: (E6tv NEWS: శివ ఠాకూర్). ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా శాఖకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని…

Read Full News