Hyderabad
తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి సి.వి. ఆనంద్!
హైదరాబాద్ : తొలి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సందేశం: సోషల్ మీడియా వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి — ఆ శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని మరియు సమాజంలో శాంతిభద్రతలు, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాస దీక్షలు…
తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…
మేడ్చల్‌లో విషాదం: మెడికో దీక్షిత సూసైడ్!
హైదరాబాద్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వైద్య విద్యార్థిని (మెడికో) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన వివరాలు: ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
నీట్ అక్రమాలపై కాంగ్రెస్ నిరసన: నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్ : నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, అలాగే ఢిల్లీలో ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు (శనివారం) సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అల్ముల రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించనున్నారు. ర్యాలీ విశేషాలు & మార్గం: రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు: నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నిరసనగా శుక్రవారం వామపక్ష…
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…
అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం
రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…
లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్). లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా…
జీవనోపాధి ఉన్నచోటే ‘ఇందిరమ్మ ఇళ్లు’: సీయూఆర్ఈ (CURE) జోన్లో నూతన గృహనిర్మాణ ప్రణాళిక విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ : పేదలకు అందజేసే గృహాలు కేవలం నివాసానికి మాత్రమే కాకుండా వారి జీవనోపాధికి భరోసా ఇచ్చేలా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని నివాస ప్రాంతాల్లోనే ‘ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్’ కాలనీలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిని పేదల గృహనిర్మాణానికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు…
TGSPDCL నుంచి వినూత్న యాప్ ‘TGNMS’: జీఐఎస్ సాంకేతికతతో విద్యుత్ సేవల్లో సరికొత్త విప్లవం!
హైదరాబాద్: విద్యుత్ రంగంలో డిజిటల్ సంస్కరణలను వేగవంతం చేస్తూ తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు పారదర్శక, నాణ్యమైన మరియు సమర్థవంతమైన విద్యుత్ సేవలను అందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఐఎస్ ఆధారిత ‘TGNMS’ (TGSPDCL GIS Network Monitoring System) అప్లికేషన్‌ను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) జితేష్ వి. పాటిల్ పర్యవేక్షణలో ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌లోని నెట్వర్క్…
