హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు:
- ప్రధాన జిల్లాలు: ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
- హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో కూడా ఈ కాలంలో వరుసగా జల్లులు పడే అవకాశం ఉంది.
- నేడు (శనివారం) సాయంత్రం/రాత్రి: ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచేరియల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చు.
ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

