రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్
సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్.
నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
ఈ కేసులో అన్వారీ బేగం అనే మహిళ రూ.6 లక్షల సుపారీ ఇచ్చి అస్లాం ఖాన్‌ను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, ఒక మోటార్‌సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ కీలక పాత్ర పోషించాయని ఎస్పీ తెలిపారు. పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.ఈ కేసును అత్యంత సమర్థవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. కేసు విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను ఆమె ప్రశంసించారు.

