Hyderabad
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా.. అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట పుట్టపర్తి, అక్టోబర్ 16 (E6tv NEWS). శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు…
ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు అధికారులు
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ముగ్గురు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సేవలు అందించడానికి లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.
వర్ష సూచన: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడనున్న వాతావరణం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్…
ప్రకృతి ఒడిలో బతుకమ్మ సందడి!
పోచారం ప్రాజెక్టు గట్టుపై పూల బతుకమ్మలు పేర్చిన చిన్నారులు.. కనువిందు చేసిన ప్రకృతి అందాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS). తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో పూల బతుకమ్మలను పేర్చుతూ చిన్నారులు, యువతులు సందడి చేశారు. పోచారం ప్రాజెక్టు పరిధిలోని పోచమ్మరాల్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు శుక్రవారం తెల్లవారుజామున ప్రాజెక్టు…
ఎత్తొండ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా కోనేరు వెంకట సుబ్బారావు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.. రైతులకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి బాన్సువాడ, అక్టోబర్ 16:(E6tv ప్రతినిధి). ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్గా నియమితులైన కోనేరు వెంకట సుబ్బారావును ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి సోంపూర్ పోచిరాం మాదిగ, జలయ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సంఘరి సాయిలు, నాగరాజు మాదిగ కలిసి ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచిరాం మాదిగ మాట్లాడుతూ, రైతులకు…
రుద్రూరులో మెగా వైద్య శిబిరం.. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
రక్తదాన శిబిరానికి స్పందించిన పలువురు దాతలు రుద్రూరు, సెప్టెంబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు….
రుద్రూరు 14వ వార్డులో జటిలంగా డ్రైనేజీ సమస్య
మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన రుద్రూరు, అక్టోబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జవహర్ నగర్ కాలనీ 14వ వార్డులో డ్రైనేజీ సమస్య జటిలంగా మారింది. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా నీరు భారీగా ప్రవహిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలనీలో గత మూడు రోజులుగా డ్రైనేజీ…
డాక్టర్ ఎంఏ హకీమ్ సేవలు అద్భుతం.. పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సామాజిక కార్యకర్త
ఆడపిల్ల పుట్టిన తల్లులకు రూ.5 వేల ఆర్థిక సాయం, దుస్తులు, తల్లి కిట్ అందజేత పోతంగల్, అక్టోబర్ 16: (E6 న్యూస్ ప్రతినిధి). పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీమ్ అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని స్థానికులు కొనియాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా…
పటాన్చెరులో అండర్-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ పటాన్చెరు, అక్టోబర్ 15 (E6tv ప్రతినిధి). పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి…
ఎల్లారెడ్డిలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన సేవలు చిరస్మరణీయం ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6tv న్యూస్). మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఎల్లారెడ్డి పట్టణంలోని గ్రంథాలయంలో బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి డాక్టర్…
