Breaking News

భీమ్‌గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్‌రెడ్డి

రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్‌గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్‌గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…

Read More

సలాబాత్‌పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్

మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్‌పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్‌పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్‌పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్‌పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…

Read More

ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్

మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ…

Read More

ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…

Read More

కాలనీలలో వారపు సంతలపై సీఎమ్‌సీ కఠిన నిబంధనలు

హైదరాబాద్: రెసిడెన్షియల్ కాలనీలలో నిర్వహించే వారపు సంతలపై (Weekly Markets) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కాలనీల్లో పారిశుధ్యం, పరిశుభ్రతను కాపాడటంలో భాగంగా ఈ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమైన నిబంధనలు: పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపాలను నివారించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని సైబరాబాద్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

Read More

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 20,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల లేఖలు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 20,000 మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్‌కార్డులు రాశారు. ఈ లేఖలను ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)గా స్వీకరించి, స్వచ్ఛందంగా (Suo Motu) విచారణ చేపట్టాలని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం హైకోర్టును కోరారు. ముఖ్యమైన అంశాలు & విజ్ఞప్తులు:

Read More

బీసీలకు కాంగ్రెస్ నమ్మకద్రోహం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ధ్వజం

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల రాజకీయం చేస్తూ వెనుకబడిన తరగతులకు (బీసీ) తీవ్ర అన్యాయం చేస్తోందని, వారి రిజర్వేషన్లను దెబ్బతీస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమైన అంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క బీసీ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిని చేయలేదని…

Read More

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడులను ప్రోత్సహించే స్వర్గధామమని, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ (హరిత ఇంధన) తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్, నోవోటెల్ వేదికగా ప్రారంభమైన రెండు రోజుల ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్‌పో 2026’ ను ఆయన మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రధాన ముఖ్యాంశాలు & క్లీన్ ఎనర్జీ లక్ష్యాలు: ఇంధన పరివర్తన (Energy…

Read More

బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం

మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్‌లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్‌ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్‌లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్‌లను దొంగిలించేందుకు…

Read More

పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…

Read More