Breaking News

రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దాడి: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపిని ఓడించడం సాధ్యం కాదనే నైరాశ్యంతోనే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య స్తంభాలపై బురదజల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.

కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ, ఈవీఎంలపై కాంగ్రెస్ పదేపదే నిందలు వేయడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తుచేసిన బండి సంజయ్.. అక్కడ గెలిచింది ఈవీఎంల విఫలం వల్లనో, సీఈసీ వైఖరి వల్లనో అయిందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *