Breaking News

అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా:అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే ఆర్మ్‌ర్ రాకేశ్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, కేవలం కొడంగల్, పరిగి వంటి కొన్ని కొన్ని ప్రాంతాలకే భారీగా నిధులు కేటాయిస్తూ తమ జిల్లాను విస్మరిస్తున్నారని సభలో మండిపడ్డారు.

ఆర్మూరులో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌వో, సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలు కూలిపోయే స్థితికి చేరాయని, క్లర్క్ స్థాయి అధికారి కూర్చోవడానికి కూడా సరైన వసతులు లేవని సభ దృష్టికి తెచ్చారు. గత రెండేళ్లుగా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా నిధుల కేటాయింపులో ఎలాంటి చొరవా చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారితే, తన పదవికి ఈరోజే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సభా వేదికగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *