Breaking News

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి).

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షుడు పరస అనంతరావు, మాజీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, మాజీ పట్టణ అధ్యక్షుడు జై జై నరసయ్య, మాజీ ఎంపీపీ కన్న సురేందర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు, బాల్కొండ మండల మాజీ అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బాల్కొండ, ఎర్గట్ల, వేల్పూర్ మండలాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *