Breaking News

అపూర్వ సమ్మేళనం.. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు

25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం బ్రాహ్మణపల్లి, అక్టోబర్ 11:(E6tv NEWS). వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటే మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లే ఉంటుంది. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. అలాంటి ఆత్మీయతకు అద్దం పట్టేలా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి…

Read Full News

పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 275 మందికి రూ.2.75 కోట్లకు పైగా ఆర్థిక సాయం నిజామాబాద్ అర్బన్, అక్టోబర్ 11 (E6TV NEWS). పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద…

Read Full News

ఓటర్ల జాబితా సవరణపై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉంది: మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 10 (E6TV న్యూస్): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ మౌనం వహించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తప్పిదాలు చేస్తోందని భావిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు నిరసనలు చేపట్టడం లేదని నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫార్ములా ఈ…

Read Full News

మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

బతుకమ్మ పండుగ మనదని గర్వంగా చెప్పుకోవాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హస్తినాపురం, హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన…

Read Full News

ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.2.20 లక్షల ఎల్‌ఓసీలు అందజేత

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ…

Read Full News

దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!

రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి). దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర…

Read Full News

చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…

Read Full News

పుట్టపర్తిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం

రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ పుట్టపర్తి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సచివాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…

Read Full News

ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…

Read Full News

ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!

తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…

Read Full News