Breaking News

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.24.70 లక్షల ఆర్థిక సాయం

రామచంద్రపురం, భారతీనగర్‌కు చెందిన 7 కుటుంబాలకు రూ.3.31 లక్షల చెక్కుల పంపిణీ పటాన్‌చెరు, నవంబర్ 18: (E6tv NEWS). ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మొత్తం రూ.24.70 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా…

Read Full News

దివ్యాంగ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేసిన ఎండీఆర్ ఫౌండేషన్

40 మంది డిగ్రీ, ఎంబీఏ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల అందజేత పటాన్‌చెరు, నవంబర్ 18: (E6tv NEWS). దివ్యాంగ విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తూ ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పటాన్‌చెరు మాజీ సర్పంచ్, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇటీవల తేజ్ శ్రీ ఫౌండేషన్ ఫర్ డిసేబుల్డ్ సంస్థకు చెందిన విద్యార్థులు మాదిరి పృథ్వీరాజ్ కార్యాలయాన్ని సందర్శించి తమ…

Read Full News

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

నిర్మల్, నవంబర్ 18:(E6tv NEWS). నిర్మల్ జిల్లాలో కుటుంబ కలహాలు, భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.వివరాల్లోకి వెళ్తే.. భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను సఖి కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి…

Read Full News

మూడు నెలల బాబుతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లి నిరసన

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మహిళ ఆరోపణ వర్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. న్యాయం చేయాలని అధికారులకు వినతి వర్ని, నవంబర్ 18:(E6tv NEWS:Shiva Thakur). తనకు న్యాయం చేయాలంటూ మూడు నెలల పసిబిడ్డతో ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించి నిరసన తెలిపిన ఘటన వర్ని మండలంలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సంబంధం కొనసాగించి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తూ తనను, తన బిడ్డను పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తిపై మహిళ ఆరోపణలు…

Read Full News

బైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని యువకుడు మృతి

నిర్మల్ జిల్లా, నవంబర్ 18: (E6TV NEWS). నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో గోకుల్ నగర్‌కు చెందిన నాగేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేష్ బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు బైక్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోగా, బస్సు ముందు అద్దం పూర్తిగా…

Read Full News

బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలి

మద్యానికి బానిసై కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దు.. సర్పంచులు, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి 40 ఏళ్లలోపు 235 మంది మద్యానికి బానిసలై మృత్యువాత పడ్డారు: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్, నవంబర్ 17:(E6tv NEWS). గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ…

Read Full News

సర్వే డబ్బులు ఇప్పించాలని తహసీల్దార్‌కు బీఎల్‌వోల వినతి

ముధోల్, నవంబర్ 17: (E6tv NEWS). ఎస్‌ఐఆర్‌ సర్వే విధులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు రావాల్సిన పారితోషికం చెల్లించలేదని ముధోల్ మండల బీఎల్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ముధోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ సర్వేకు సంబంధించిన విధులను పూర్తిస్థాయిలో నిర్వహించి పూర్తి చేసినప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు అందలేదని తెలిపారు. పక్క జిల్లాల్లో సర్వే విధులు…

Read Full News

విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

దెగాం, నవంబర్ 17: (E6tv NEWS). విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూత అందించాలనే లక్ష్యంతో దెగాం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భోసలే మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోసలే మోహన్ రావు పాటిల్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప సంపద అని…

Read Full News

శేరిలింగంపల్లిలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ

పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి, నవంబర్ 17: (E6tv NEWS). శేరిలింగంపల్లి సర్కిల్-49, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మలేంపాటి ఐఏఎస్, తెలంగాణ యాదవ కురుమ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్…

Read Full News

జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త శకం.. అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు!

చిన్న కోతలతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం తక్కువ నొప్పి.. వేగంగా కోలుకునే అవకాశం యశోద హాస్పిటల్స్‌లో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు నిజామాబాద్, నవంబర్ 17:(E6tv NEWS). ఆధునిక వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో శస్త్రచికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మినిమల్లీ ఇన్వేసివ్ లాపరోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సుధీర్ మూడద్ల తెలిపారు. అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ మరియు మినిమల్లీ…

Read Full News