Nalgonda
మెట్పల్లిలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
ఎమ్మెల్యే సంజయ్ నివాసం ముట్టడికి కాంగ్రెస్ నాయకుల యత్నం.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు మెట్పల్లి, నవంబర్ 17: (E6tv NEWS). జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మున్సిపల్ కార్మికులను తన వ్యక్తిగత పనులకు వినియోగించుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలకు నిరసనగా ఎమ్మెల్యే సంజయ్ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి…
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క!
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. కష్టసుఖాల్లో అండగా ఉంటా లండన్ పర్యటన ముగించుకొని బాన్సువాడకు చేరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కోటగిరి, నవంబర్ 17: (E6tv NEWS). లండన్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి చేరుకున్న బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేలా పర్యటన చేపట్టారు. కోటగిరి గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యకర్తలతో…
ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్!
రూ.24 కోట్ల భవనంలో విద్యుత్ వైరింగ్ దగ్ధం.. ఊడిపడిన లైట్లు నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ టీఆర్ఎస్ నాయకుడు దాస్ ఆరోపణ ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య వల్లే అధిక వోల్టేజ్.. ఆసుపత్రి భవనాన్ని ఇంకా కాంట్రాక్టర్ అప్పగించలేదు – జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ వర్ని, నవంబర్ 17: (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించి ప్రారంభించిన ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్…
పదేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. తీరని భూ సమస్య!
32 గుంటల భూమి ఆన్లైన్లో మాయం.. న్యాయం చేయాలని ప్రజావాణిలో బాధితురాలి కుమారుడి ఫిర్యాదు పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదు కాని భూమి కోటగిరి, నవంబర్ 17: (E6tv NEWS). తమకు చట్టబద్ధంగా సంక్రమించిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని కోరుతూ ఓ బాధిత కుటుంబం గత పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కోటగిరి మండల కేంద్రంలో నవంబర్…
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ పటిష్టం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఇందూరు చంద్రశేఖర్ రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని బీఆర్ఎస్ నాయకులకు హితవు రుద్రూర్, నవంబర్ 17: (E6tv NEWS). ప్రజాధనంతో నిర్మించే ప్రాజెక్టులు తరతరాలకు ఉపయోగపడేలా ఉండాలని, పాలకుల ప్రచారానికి, రాజకీయ ప్రయోజనాలకు పరిమితం కాకూడదని బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ పటిష్టంగా నిలిచి ప్రజలకు, రైతులకు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఎమ్మెల్యే సానుకూల స్పందన
ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తా: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, నవంబర్ 16: (E6tv NEWS). ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు…
పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం ఎక్కడ?
ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం! రుద్రూర్ శివారులోని సర్వే నంబర్ 7/E/1 స్థిరాస్తి కబ్జా నుంచి విముక్తి చేయాలని బాధిత కుటుంబం వేడుకోలు రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS). ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఓ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. చేతిలో ఆస్తికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా న్యాయం కోసం ప్రభుత్వ…
భిక్కనూర్ గ్రామ పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, నవంబర్ 16:(E6tvNEWS). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో భిక్కనూర్ గ్రామానికి చెందిన అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భిక్కనూర్ గ్రామ సర్పంచ్ చాకలి సాయిలు, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు…
శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులు వేగవంతం
వాల్ టు వాల్ సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి, నవంబర్ 16:(E6tv NEWS). శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు.డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, గోపీనగర్ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు….
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తా
అసెంబ్లీలో పెన్షన్లపై మాట్లాడిన ఏకైక వ్యక్తిని నేనే.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్, నవంబర్ 16: (E6tv NEWS). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్, నందిపేట్ మండల కేంద్రాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన పెన్షన్లపై లబ్ధిదారులతో మాట్లాడి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ…
