Breaking News

పేదల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలే అండ

పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, నవంబర్ 16: (E6tv NEWS). పేదల జీవితాల్లో వెలుగులు నింపడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన…

Read Full News

ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

జగిత్యాల, నవంబర్ 16:(E6tv NEWS). జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య రోడ్డు దాటుతుండగా జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన కారు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య మృతిచెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని…

Read Full News

బుగ్గారం పోలీసులకు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు

సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వకపోవడంపై మరోసారి విచారణకు ఆదేశాలు నాలుగు రోజుల్లో సమాచారం ఇస్తామన్న ఎస్ఐ హామీ అమలు కాలేదని బాధితుడి ఆరోపణ ధర్మపురి, నవంబర్ 16: (E6tv NEWS). బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో జరిగినట్లు ఆరోపిస్తున్న దాడికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని సమాచార హక్కు చట్టం కింద కోరినా అందించకపోవడంపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంపై రెండోసారి విచారణకు ఆదేశిస్తూ సంబంధిత పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.సీనియర్…

Read Full News

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను పరామర్శించిన టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్

వేములవాడ, నవంబర్ 16: (E6tv NEWS). వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి గాయమై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆది శ్రీనివాస్‌ను సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో విజయ్ ఆజాద్ కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొమిరెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆది శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ…

Read Full News

మౌలాన్ ఖేడ్‌లో ఏడుగురు లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరు

లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ ఎల్లారెడ్డి, నవంబర్ 16: (E6tvNEWS). కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో సోమవారం వారికి మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసి అభినందించారు. అనంతరం సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ…

Read Full News

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా!

నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మెట్‌పల్లిలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహణ పథకం లక్ష్యాలను వివరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి జగిత్యాల, నవంబర్ 16: (E6tv NEWS). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు…

Read Full News

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS). అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త జిలకరి మహేందర్ తండ్రి జిలకరి సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక బీజేపీ నాయకుల ద్వారా…

Read Full News

కొండాపూర్‌లో సర్పంచ్‌పై గ్రామస్తుల ఆగ్రహం!

గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపణ కలుషిత తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల సమస్యలతో అవస్థలు ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు తమకు న్యాయం చేయాలని గ్రామస్తుల నిరసన రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ గొంటి సాయిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, సమస్యలపై ప్రశ్నించిన ప్రజల పట్ల దురుసుగా…

Read Full News

గోపాల్పేట్ బస్టాండ్‌లో సమస్యల తిష్ట!

మూతపడిన మరుగుదొడ్లు.. రాత్రివేళల్లో వెలగని లైట్లు కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల అవస్థలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులకు ప్రయాణికుల విజ్ఞప్తి ఎల్లారెడ్డి, నవంబర్ 15: (E6tv NEWS). కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారి మూతపడ్డాయి. దీంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో…

Read Full News

కార్తీక మాసంలో భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర!

నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం పెద్దలకు రూ.2,500.. పిల్లలకు రూ.1,875 టికెట్ ధర నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS). కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా ఝరాసంగం శివాలయం, రేజింతల్ సిద్ధి వినాయక…

Read Full News