Breaking News

తెలంగాణ అసెంబ్లీ 8వ రోజు సమావేశాలు: ఎల్​నినో, 22ఏ భూములపై కీలక చర్చలు!

తెలంగాణ శాసనసభ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగా, పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు వివరంగా సమాధానాలు ఇచ్చారు. సభ మరియు అసెంబ్లీ కమిటీ హాల్‌ సమావేశాల కీలక విశేషాలు:

Read Full News

మోదీ పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గుతున్నాయి

రైతు కూలీల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య బోధన్ రూరల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. శుక్రవారం బోధన్ మండలం పెద్ద మావంది గ్రామంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభ…

Read Full News

కేటీఆర్ పీఆర్‌ఓ మహేష్ మాణిక్య అరెస్ట్.. బొల్లారం పోలీసుల చర్య!

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌ఓ (PRO) మహేష్ మాణిక్యను బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డంకి కలిగించడమే కాకుండా, శాంతిభద్రతల దృష్ట్యా విధించిన ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసి ఈ చర్యలు చేపట్టారు. ఘటన నేపథ్యం & ఆరోపణలు: గతంలో సెప్టెంబరు 7న తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన సందర్భంగా కూడా పోలీసుల పనులకు అడ్డంకి కలిగించారనే ఆరోపణలతో మహేష్ మాణిక్యతో పాటు కేటీఆర్…

Read Full News

28 ప్యాకేజీకి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలి

పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముధోల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) ముధోల్ నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, వాటి పూర్తికి ప్రభుత్వం తక్షణమే రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే 28 ప్యాకేజీ పనుల అంశాన్ని…

Read Full News

నాంపల్లి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరైన కేటీఆర్!

ఫార్ములా ఈ-రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా న్యాయస్థానం ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యారు. కేసు నేపథ్యం & ఏసీబీ చార్జ్‌షీట్ వివరాలు: గత విచారణ సమయంలో కేటీఆర్ వ్యక్తిగత…

Read Full News

సెమీకండక్టర్ రంగానికి సింగపూర్ పచ్చజెండా: సీఎం రేవంత్‌తో ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. భేటీలోని ప్రధాన ముఖ్యాంశాలు: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న…

Read Full News

నిజామాబాద్‌లో దారుణం: యూట్యూబర్ భర్త హరిబాబును నరికి చంపిన భావమరిది..

నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. ప్రసిద్ధ యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)ను నిజామాబాద్‌లోని రాజరాజేంద్ర (ఆర్‌ఆర్) చౌరస్తా వద్ద ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొబ్బరి బొండాల కత్తితో దాడి ప్రత్యక్ష సాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబుపై ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో…

Read Full News

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు…

Read Full News

హత్య స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్, సెప్టెంబర్ 17:{E6tv NEWS: శివ ఠాకూర్) నగరంలోని టౌన్-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన…

Read Full News

డీజే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన పోలీసులు

మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఏర్పాటు చేయాలనుకున్న గణేష్ మండలి నిర్వాహకులకు పోలీసులు అండగా నిలిచారు. డీజేకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, రెండు నెలల క్రితం చెల్లించిన రూ.5 వేల అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇప్పించారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్…

Read Full News