Telangana
యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో సర్పంచ్ అశోక్ పటేల్‌కు సన్మానం
మద్నూర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) మేనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్‌ను ఘనంగా సన్మానించారు. శుక్రవారం గణేష్ మండలి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ పటేల్ పాల్గొన్నారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ అశోక్ పటేల్‌కు గణేష్ మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనూర్ కెనరా బ్యాంక్ అధికారులు కుమారస్వామి, ఉష, సంతోష్, ఆకాష్, నవీన్…
యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
హిందూపురం క్రీడా సంస్కృతికి నిలయం అనంతపురం, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణతో పాటు ప్రోత్సాహం అందించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా RDT క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది…
వర్షాభావ పరిస్థితుల్లో కేంద్ర సహకారం అందించాలి
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి E6tv NEWS: (సెప్టెంబర్ 18). ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర…
3,800 మందికి పైగా ఉచిత ఆరోగ్య సేవలు
నిజామాబాద్ స్టార్ హెల్త్ ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). స్థానిక ప్రజలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,800 మందికి పైగా ప్రజలు సేవలను వినియోగించుకున్నారు. రోజుకు సగటున 15 మందికి పైగా కేంద్రాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వేణు…
నిజామాబాద్ రీజియన్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
వాణిజ్య ఆదాయం పెంపునకు అవకాశాల పరిశీలన నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (IT, P, A, M & Legal) ఎం. రాజశేఖర్ నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి, నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం.వి. రమణ, నిజామాబాద్-2 డిపో…
సర్పంచ్ అశోక్ పటేల్‌కు ఘన సన్మానం
యువసేన గణేష్ మండలి నిర్వాహకుల అభినందనలు మెనూర్, సెప్టెంబర్ 18;(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి నిర్వాహకులు, గ్రామ పెద్దలు సర్పంచ్ అశోక్ పటేల్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. గణేష్ మండలి వద్ద సర్పంచ్ అశోక్ పటేల్ తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందించారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు సేవ…
యువ గణేష్ మండలిలో ఘనంగా అన్నదానం
సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించిన సర్పంచ్ అశోక్ పటేల్ మద్నూర్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ జాంషెట్‌వార్ తన సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం గ్రామ సంత (అంగడి) ఉండటంతో అన్నదాన కార్యక్రమానికి గ్రామస్థులు, యువకులు, సంతకు వచ్చిన ప్రజలు, పాఠశాల విద్యార్థులు,…
ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి
డీఎంహెచ్‌ఓకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వినతిపత్రం శ్రీ సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఫైరోజ్ బేగంకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్కర్స్‌తో రికార్డులు రాయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్స్‌పై అనవసరమైన పనిభారం,…
దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి గుణపాఠం ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుణపాఠం తప్పదు: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి) దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన…
గోదావరి పుష్కరాలకు ఏప్రిల్ డెడ్‌లైన్.. కుంభమేళా రేంజ్‌లో ఏర్పాట్లు: శ్రీధర్ బాబు!
తెలంగాణలో రాబోయే ‘గోదావరి పుష్కరాలు-2027’ ను అత్యంత వైభవంగా, ఉత్తరాది కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పుష్కరాలకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు, అభివృద్ధి పనులను వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ నాటికి సమగ్రంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన దేవాదాయశాఖ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు సమీక్ష…
