Telangana
స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల చర్చ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా…
అత్తాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్చల్..
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిగల చింతల్మెట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి వేళ పోకిరీల ఆగడాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మోడిఫైడ్ కార్లతో మైనర్ యువకులు రోడ్లపై అతివేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిరంతరం ‘చబుత్రా మిషన్’తో పాటు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ పోకిరీల హంగామా ఆగడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు…
కారులో పవర్ బ్యాంక్ పేలుడు: తృటిలో తప్పించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చందర్ నాయక్‌కు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. మహబూబాబాద్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కారు కేబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రామ్‌చందర్ నాయక్ మరొక వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
కరీంనగర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక హామీ.. డంపింగ్ యార్డ్ పనులకు త్వరలోనే టెండర్లు!
కరీంనగర్ నగర అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో రూ.16 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులతో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద మంజూరైన రూ.840 కోట్లలో మరో రూ.80 కోట్లను ప్రత్యేకంగా ఈ డంపింగ్ యార్డ్ ఆధునీకరణకే వెచ్చిస్తామని వెల్లడించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్,…
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు….
నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం!
హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు. వాహనాల గుర్తింపును దాచేందుకు, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లను మార్చిన వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, గత వారం రోజుల్లోనే ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలను జప్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను (HSRP) మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్…
భక్తి సంబరం.. ఆర్థిక చైతన్యం: భాగ్యనగరంలో రూ.10 వేల కోట్ల గణేశ్ వ్యాపారం!
హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులు కేవలం ఆధ్యాత్మిక ఆనందాన్నే కాకుండా, నగర ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తూ వేల కోట్ల రూపాయల వాణిజ్యానికి వేదికగా నిలుస్తున్నాయి. శూన్యమాసంలో వెలవెలబోయిన పలు వ్యాపారాలకు ఈ ఉత్సవాలు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రధాన ముఖ్యాంశాలు: అంశం వివరాలు మొత్తం వ్యాపార అంచనా రూ. 6,000 కోట్లు (అధికారిక) / రూ. 10,000 కోట్లు (అనధికారిక) ఉపాధి పరిమాణం 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, 4 లక్షల మందికి పరోక్షంగా విగ్రహాల అమ్మకాలు రూ….
ప్రజా పాలన దినోత్సవం వేళ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్!
హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ…
ఆశ్రయ్ మెడోస్‌లో ఏం జరుగుతోంది? నివాసితుల సంచలన ఆరోపణలు!
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ఆశ్రయ్ మెడోస్ అపార్ట్మెంట్స్ తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. భవనాలను పూర్తిగా నివాస అవసరాలకే వినియోగిస్తామని నిర్మాణ సమయంలో చేసుకున్న ఒప్పందాల (MoU) ఆధారంగానే తాము ఇక్కడ ఇళ్ళు కొనుగోలు చేశామని, కానీ తీరా నిర్మాణం పూర్తయ్యాక నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆశ్రయ్ మెడోస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వాణిజ్య వ్యాపారాల వల్ల బయటి వ్యక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయి, ప్రాంగణంలోని మహిళలు, పిల్లలు, వృద్ధుల…
దొరల పాలన కాదు.. ప్రజా పాలన
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలకు తావులేదుదళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ రుద్రూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూరు…
