Breaking News

అణిచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కుంటాల:, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) అణిచివేతకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితం…

Read Full News

భైంసాలో శాంతియుతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం

జిల్లా ఎస్పీకి మున్సిపల్ కౌన్సిలర్ల కృతజ్ఞతలు భైంసా, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, శోభాయమానంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణతో పాటు ముందస్తు…

Read Full News

గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నిర్మల్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 25న నిర్మల్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్, IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీఐజీకి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్…

Read Full News

హుడా కాలనీలో ఘనంగా అన్న సమారాధన

శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 25(E6TV న్యూస్):శేర్లింగంపల్లి పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్న సమారాధన (అన్నదానం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో…

Read Full News

పొతంగల్, ఎత్తోండా సొసైటీల్లో నామినేటెడ్ చైర్మన్ ఎన్నిక వద్దు

రైతులు, సొసైటీ సభ్యుల ద్వారానే ఎన్నిక నిర్వహించాలి సొసైటీల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలిబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ పోతంగల్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్…

Read Full News

చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) సి. సూర్యనారాయణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సూర్యనారాయణ మండల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు కృషి…

Read Full News

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా

ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనను తిరిగి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే వెల్లడిస్తానని చెప్పారు.ఎన్నికల…

Read Full News

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

ఇందూర్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మంజూరైన రూ.1.25 కోట్లతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణ…

Read Full News

అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవ కార్యక్రమం

అనంతపురం,సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి) అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. వినికిడి, మాట్లాడే లోపాలతో ఉన్న దివ్యాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా…

Read Full News

జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి

మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి). జర్నలిస్ట్ బసవరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ…

Read Full News