Warangal
అవకతవకలకు తావులేదు..
స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….
కరీంనగర్ – వరంగల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: అక్టోబర్‌లో ఫోర్ లేన్ హైవే ప్రారంభం!
కరీంనగర్: కరీంనగర్ మరియు వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జగిత్యాల – వరంగల్ జాతీయ రహదారి 563 (NH-563) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ నుంచి హనుమకొండ వరకు నిర్మించిన 68 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేపై సెప్టెంబర్ 5 నుంచే ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. రూ. 2,486 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక రహదారిని అక్టోబర్ నెలలో ప్రధాని నరేంద్ర…
హుడా కాలనీలో ఉచిత వైద్య శిబిరం
శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గణేష్ మండపం వద్ద ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు, స్థానికులు…
ఏఐకేఎంఎస్ నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య బిచ్కుంద, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో శనివారం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను…
రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్‌లో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ధర్మవరం, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). ధర్మవరం పట్టణంలోని సి.ఎన్.బి. గార్డెన్స్‌లో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ధర్మవరానికి చెందిన మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. నృత్య గురువు, మానస నృత్య కళాకేంద్రం ఫౌండర్ గౌ. ఆర్. మానస ఆధ్వర్యంలో శిష్యులు శాన్వి స్వరూప్, భావన, సంధ్య శ్రీ, కావ్యశ్రీ తమ అద్భుతమైన…
హుజురాబాద్‌లో రూ.15 లక్షలతో మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన
హుజురాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో మురికి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.15 లక్షల వ్యయంతో చేపడుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. మురికి కాలువ నిర్మాణంతో డ్రైనేజీ…
కదిరి అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలి
ఎమ్మెల్యే, ఆర్డీఓలకు కాంగ్రెస్ నేతల వినతి పత్రాలు కదిరి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో కదిరిలో ఇచ్చిన అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన…
యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
హిందూపురం క్రీడా సంస్కృతికి నిలయం అనంతపురం, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణతో పాటు ప్రోత్సాహం అందించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా RDT క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది…
వర్షాభావ పరిస్థితుల్లో కేంద్ర సహకారం అందించాలి
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి E6tv NEWS: (సెప్టెంబర్ 18). ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర…
ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి
డీఎంహెచ్‌ఓకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వినతిపత్రం శ్రీ సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఫైరోజ్ బేగంకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్కర్స్‌తో రికార్డులు రాయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్స్‌పై అనవసరమైన పనిభారం,…
