Warangal
తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…
ఈ ఖరీఫ్‌లో ‘వరి’ వేస్తే నీళ్లివ్వలేం.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ / వరంగల్: రాష్ట్రంలో సాగునీటి కొరత రైతులకు తీరని ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వహించడంలో విఫలమైందని, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణమని వస్తున్న విమర్శలకు తోడు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు రైతాంగాన్ని మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో వరి పంటకు నీరందిస్తామని తాను గ్యారెంటీ ఇవ్వలేనని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రైతులు ఆతురతపడి వరి వేసి నష్టపోవద్దని,…
యూరియా కొరత తర్వాత కరెంట్ కష్టాలు: తెలంగాణలో రోడ్డెక్కిన రైతన్నలు!
హైదరాబాద్ : గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, ఈ సీజన్‌లో తీవ్రమైన యూరియా కొరతతో అల్లాడిపోయిన తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కరెంట్ రోజుకు కొద్ది గంటలు కూడా సక్రమంగా రాకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు. జిల్లాల్లో మిన్నంటిన నిరసన జ్వాలలు స్వయంగా బోర్ల కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో, విద్యుత్…
తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!
జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…
నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*
*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….
కట్టుదిట్టమైన భద్రత మధ్య బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం ఎన్నిక – ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం…
#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత
#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్** జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి * **దిల్‌సుఖ్‌నగర్ నిరుద్యోగుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక**దిల్‌సుఖ్‌నగర్, జూన్ 29:**నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగుల ధర్నాలో ఆమె స్వయంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా…
కరెంట్ బిల్లు నెలాఖరులో చెల్లిస్తే వెంటనే కరెంట్ కట్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?
హైదరాబాద్, E6TV ప్రత్యేక కథనం ప్రతి నెల కరెంట్ బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని చెప్పి, కొంతమంది వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను వెంటనే నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ లైన్‌మెన్‌లు లేదా కాంట్రాక్ట్ సిబ్బంది వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటంటే… బిల్లు డ్యూ డేట్ దాటిందని వెంటనే కరెంట్ కట్ చేయవచ్చా? చట్టం ప్రకారం సమాధానం – లేదు. విద్యుత్ చట్టం (Electricity Act, 2003) సెక్షన్ 56 ప్రకారం,…

