Warangal
గణేష్ రథయాత్ర మార్గంలో బీటీ రోడ్డు పనుల పర్యవేక్షణ
నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: శివ ఠాకూర్). నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వజనిక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా గణేష్ రథయాత్ర వెళ్లే మార్గంలోని గుర్బాబాది రోడ్డు – శివాజీ చౌక్ నుంచి రైల్వే గేట్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, 35 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఎర్రం సుధీర్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో…
విద్యార్థులతో మొక్కలు నాటించిన అధికారులు
ఎర్గట్ల, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). ఎరుగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. “Ek Ped Maa Ke Naam” కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ, గ్రామపంచాయతీ…
ధర్మవరం పట్టణ అభివృద్ధికి రూ.242.28 కోట్ల సమగ్ర ప్రణాళిక
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రభుత్వ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఎంజీఎం స్లాబ్ కూలిన ఘటన:సీజేపీ నేతల భారీ ధర్నా!
వరంగల్: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలైన ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు, ఆసుపత్రి పరిస్థితిని పరిశీలించేందుకు రాగా పోలీసులు వారిని ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల విమర్శలు: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీజేపీ నాయకులను లోపలికి అనుమతించకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో కొంతసేపు…
తానూర్‌లో ఇంటిపై పిడుగుపాటు
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర…
ముధోల్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు…
ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ
నిర్మల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో…
భైంసాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా…
భీంగల్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రష్మీ గౌతమ్
భీంగల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ సోమవారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రణీత్ పంతులు, విష్ణు పంతులు, నర్సయ్య పంతులు, నారాయణ పంతులు రష్మీ గౌతమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఆమె ఆలయ మహిమ, విశిష్టత గురించి తెలుసుకుని కొంత సమయం భక్తి భావంతో…
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ
నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్,…
